గుంటూరులో 242 కిలోల గంజాయి స్వాధీనం

137

గుంటూరు: పోలీసుల కళ్లుగప్పి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతర్‌ జిల్లా ముఠా పట్టుబడింది. విశాఖ జిల్లా పాడేరు నుంచి తమిళనాడు రాష్ట్రానికి రెండు కార్ల ద్వారా గంజాయి తరలిస్తున్న ముఠాను గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ రామకృష్ణ ఆదేశాల మేరకు ఖాజా టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహించి టీఎన్ 39 ఏయూ 8080 నంబరు గల కారుని అందులోని అనుమానాస్పద వ్యక్తులను విచారించి గంజాయి తరలించే ముఠాగా గుర్తించారు. మరొక కారులో గంజాయి ఉన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు చేజ్ చేసి యడ్లపాడు వద్ద పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న మణి కంధన్, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, రెండు కార్లను, 242 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి తరలిస్తున్న ముఠా చెప్పిన దాన్నిబట్టి వారి వెనుక ఎవరి హస్తం ఉందో అనే కోణంలో దర్యాప్తు జరిపి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ రామకృష్ణ మీడియాకు తెలిపారు.