అందరికీ విద్య రాజన్న ప్రభుత్వ లక్ష్యం

40
  • ఏపీ దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్

విజయవాడ: పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరికీ విద్య రాజన్న ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర దేవ‌దాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ‘మా ఇల్లు -సరస్వతి విద్యాపీఠం’ అధ్వ‌ర్యంలో వ‌న్‌టౌన్‌ కొత్తగుళ్ల శేష‌య్య వీధీలో శ్రీకృష్ణ ప్రార్ధన మందిరంలో చిన్నారులు, పేద విద్యార్థులకు ఉచిత పుస్త‌కాల‌ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నమంత్రి శ్రీనివాస్ తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.

అనంతరం విద్యార్థిని, విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తశుద్ధితో ఎటువంటి లాభాపేక్ష లేకుండా గత 15 సంవత్సరాలుగా ‘మా ఇల్లు’ సంస్థ నిర్వాహకులు సరస్వతి విద్యాపీఠం అధ్వ‌ర్యంలో పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ చేయడం చాలా అభినందనీయం అన్నారు. అందరికీ విద్య అందించాలని వైయస్ఆర్సీపీ ప్రభుత్వము జనవరి 26 నుంచి అమ్మఒడి పథకం ద్వారా 15 వేల రూపాయలను అందజేయడం జరుగుతుందన్నారు.

ప్రభుత్వ పథకాలతో పాటు మాఇల్లు వంటి స్వ‌చ్ఛంద సంస్థ‌లు కూడా విద్యార్థినీ విద్యార్థుల విద్య‌కు అందిస్తున్న సేవలు ఉపయోగించుకొని విద్యలో ఉన్నత, అభివృద్ధిని సాధించాలని సూచించారు. కార్యక్రమంలో కొన‌క‌ళ్ల విద్యాధ‌ర‌రావు, ‘మా ఇల్లు సరస్వతి విద్యాపీఠం’ నిర్వాహకులు, విద్యార్థిని, విద్యార్థుల త‌ల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.