బంగారం స్కామ్‌లో స్టేట్ బ్యాంక్ క్యాషియర్ అరెస్టు

46

అమరావతి: నగదు లావాదేవీలకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) క్యాషియర్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచ్‌లో శ్రీనివాసరావు అనే ఉద్యోగి క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ఖాతాదారులు బ్యాంకులో తాకట్టుపెట్టిన బంగారాన్ని శ్రీనివాసరావు తన సొంత అవసరాలకు వాడకున్నట్లు గుర్తించారు.

అదే విధంగా డ్వాక్రా సొమ్మును కూడా సైడ్ చేశారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అనంతరం అతనిపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనివాసరావును ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతని వద్ద నుంచి 2 కేజీల బంగారం, రూ. 25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.