విశాఖ జిల్లాలో విషాదం నింపిన కుటుంబ ఆత్మహత్య

37

విశాఖపట్నం: విశాఖ జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం సింహాచలంలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఫల్ఫీ ఆరంజ్ కూల్ డ్రింక్ బాటిల్‌లో క్రిమిసంహారిక మందు కలుపుకొని సేవించి కుటుంబ సభ్యులు ప్రాణాలు విడిచారు. బాధిత కుటుంబం విజయనగరం జిల్లా గరివిడికి చందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ దారుణానికి కుటుంబ ఆర్ధిక పరిస్థితులే కారణమని సమాచారం.

కుటుంబ పెద్ద సింహాద్రి ఈశ్వరరావు, కూతురు చాందిని మృతి చెందగా, ఈశ్వరరావు భార్య చంద్రకళ పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర చికిత్స నిమిత్తం నగరంలోని కింగ్‌జార్జ్ ఆసుపత్రికి తరలించారు. కాగా, అచ్యుతాపురం మండలంలోని చోడపల్లికి చెందిన చౌక డిపో డీలర్‌ పట్నాల ఈశ్వరరావు (58) పాముకాటుకు గురై మృతిచెందారు.

ప్రతిరోజు మాదిరిగానే కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఉదయం ఆరుబయటకు వెళ్లిన భర్త ఎప్పటికి తిరిగి రాకపోవడంతో భార్య కుమారుడితో కలిసి గ్రామంలో అన్వేషించినా అచూకి తెలియలేదు. తుప్పల్లో పడి ఉన్న డీలర్‌ని పశువులు కాసేవారు గుర్తించి ఆయన భార్యకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల వచ్చి చూసేసరికే అప్పటికే చనిపోయి ఉన్నాడు.

పాముకాటుకు గురై తుప్పల్లో పడిపోయి అక్కడికికక్కడే మృతిచెందినట్లు గుర్తించారు. చౌక డిపో డీలర్‌గా ఎన్నో ఏళ్లు సేవలు అందించిన ఈశ్వరరావు మృతితో చోడపల్లిలో విషాదం నెలకొంది. ఈయనకు భార్య పైడితల్లితో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నాడు.