సాఫ్ట్‌వేర్ సుధీర్‌గా రానున్న ‘సుడిగాలి సుధీర్’

62

హైదరాబాద్: బుల్లితెర షోస్ జ‌బ‌ర్ధ‌స్త్‌, ఢీ, పోవే పోరా వంటి కార్య‌క్ర‌మాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన యాంక‌ర్ సుధీర్. జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంతో సుడిగాలి సుధీర్‌గా మారిన ఈయ‌న ఇప్పుడు సాఫ్ట్‌వేర్ సుధీర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. వెండితెర‌పై ప‌లు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ పోషించిన సుధీర్ ఇప్పుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అనే చిత్రంలో హీరోగా క‌నిపించ‌నున్నాడు. ధన్యా బాలకృష్ణ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు.

శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 50 శాతం టాకీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై చివ‌రి వారంలో రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. చిత్ర క‌థ‌నే సినిమాకి హీరో అని సుధీర్ అంటున్నారు. ఈ చిత్రం త‌న‌కి మంచి విజ‌యం అందిస్తుంద‌ని భావిస్తున్నాడు సుధీర్.