జర్నలిస్టుల హక్కుల సాధనే ధ్యేయం: ఐజేయూ

36

బెంగళూరు: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం ఉదయం 11 గంటలకు ఇక్కడి రేవా యూనివర్సిటీలొని కల్పనాచావ్లా ఆడిటోరియంలో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య పి. శ్యామరాజు జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాలను ప్రారంభించారు.

ఐజేయూ జాతీయ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, సెక్రటరీ జనరల్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు, ఐజేయూ పూర్వపు అధ్యక్షుడు కె. శ్రీనివాసరెడ్డి, పీసీఐ మాజీ సభ్యుడు కె. అమర్‌నాధ్, జాతీయ కార్యదర్శులు అంబటి ఆంజనేయులు, వై. నరేంద్రరెడ్డి, కె. సత్యనారాయణ, తెలుగు రాష్ట్రాలకు చెందిన యూనియన్ నేతలు ఐవీ సుబ్బారావు, చందు జనార్ధన్, నల్లి ధర్మారావు, ఆలపాటి సురేష్, డి. సోమసుందర్ తదితరులు పాల్గొన్నారు.

దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఇటీవల మరణించిన జర్నలిస్టులకు సమావేశం ముందుగా సంతాపం తెలిపింది. ఈమేరకు సంతాప తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. అనంతరం వివిధ సమస్యలపై కార్యవర్గం సుదీర్ఘంగా చర్చించింది.