జగ్జీవన్‌రామ్‌ ఆశయసాధనకు కృషి: ఏయూ వీసీ

28

విశాఖపట్నం: ఆదర్శవంతమైన నాయకత్వం బాబు జగ్జీవన్‌రామ్‌ సొంతమని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు అన్నారు. శనివారం ఉదయం ఏయూలోని జగ్జీవన్‌ రామ్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. దేశంలో విభిన్న సంస్కరణలకు జగ్జీవన్‌రామ్‌ ఆధ్యునిగా నిలచారన్నారు.

యువకునిగా రాజకీయాలలో అడుగిడి సుదీర్ఘకాలం విభిన్న పదవులను సమర్ధవంతంగా నిర్వహించిన అందరి మన్ననలు పొందారన్నారు. వ్యవసాయ, కార్మిక, రక్షణ, రైల్వే మంత్రిగా పనిచేసిన కాలంలో దార్శినికతతో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సంస్కరణలు నేటికి సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్‌ ఆచార్య ఎం.ప్రసాద రావు, రిజిస్ట్రార్‌ ఆచార్య కె.నిరంజన్‌, ఆచార్యులు, డీన్‌లు, అదికారులు, ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.