మెగా లోక్‌అదాలత్ నిర్వహణకు ఏర్పాట్లు

27

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మునిషిఫ్ కోర్టులో శనివారం సీనియర్ న్యాయమూర్తి భాస్కర్ ఆధ్వర్యంలో ఈ నెల13న మెగా లోక్‌ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ లోక్‌ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఆర్మూర్ ఏసీపీ అందే రాములుతో పాటు ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో, సీఐలు, రూరల్ సీఐ, డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పొలీస్ సిబ్బంది తదితరులు హాజరుకానున్నారు.

అనంతరం న్యాయమూర్తి భాస్కర్ మాట్లాడుతూ ఏలాంటి కక్ష సాధింపులకు పోకుండా ఇరువర్గాల వారు ఒకథాటికి వచ్చి ముందు చూపుతో రాజీపడి తమ కేసులను కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నవి ఈ మెగా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్మూర్ డివిజన్ పోలీస్ ఉన్నత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.