ఏయూ సైన్స్ కాలేజీ ఫ్యాకల్టీ చైర్మన్‌గా శ్రీనివాసరావు

116

విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్‌ కళాశాల ఫ్యాకల్టీ చైర్మన్‌గా స్టాటస్టిక్స్‌ విభాగ సీనియర్‌ ఆచార్యులు కె.శ్రీనివాసరావు నియమితులయ్యారు. గురువారం ఉదయం ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు తన కార్యాలయంలో ఆచార్య శ్రీనివాసరావుకు ఉత్తర్వులను అందజేశారు. ఈయన ఫ్యాకల్టీ చైర్మన్‌గా మూడు సంవత్సరాల కాలం కొనసాగుతారు.

అకడమిక్‌ సెనేట్‌లో ఎక్స్‌అఫీషియో సభ్యునిగా కొనసాగుతారు. ఆచార్య శ్రీనివాసరావు ప్రస్తుతం స్టాటస్టిక్స్‌ విభాగాధిపతిగా సేవలు అందిస్తున్నారు. ఏపీసెట్‌ కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆచార్య శ్రీనివాసరావును పలువురు ఆచార్యులు అభినందించారు.