కేసీఆర్‌వి తుగ్లక్‌ చర్యలు: టీపీసీసీ నేతల ధ్వజం

114

హైదరాబాద్: కొత్త సచివాలయ నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబవ్యవహారం కాదని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. కేసీఆర్‌ చేస్తున్న పనులు తుగ్లక్‌ చర్యలను మరిపింపజేస్తున్నాయని మండిపడ్డారు. సచివాలయ భవనాలను కాంగ్రెస్‌ నేతలు సందర్శించారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియ జెప్పాడానికే మేము సచివాలయ సందర్శన చేసామని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ సచివాలయ భవనాలను కలుస్తా అంటున్నాడు కాని, ఈ రాష్ట్రం అనేక అవసరాల కోసం తెచుకున్నామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సరిపోయే అన్ని సదుపాయాలు, హంగులు అసెంబ్లీకి, సచివాలయానికి ఉన్నాయన్నారు. వసతులు లేవు అని ఈ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, సచివాలయంలో అన్ని బ్లాకులు 10 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల క్రితం కట్టినవేనని పేర్కొన్నారు. అందరి అవసరాలు తీర్చే అతిపెద్ద భవనం ఈ సచివాలయమని, సచివాలయంలో ఉన్న అన్ని బ్లాక్‌లు చాలా బాగున్నాయని తెలిపారు.

సీఎం కేసీఆర్ మనసులో ఇక దుర్మార్గ ఆలోచన తట్టిందని, అన్ని భవనాల పైన తన పేరు ఉండేలా కేసీఆర్ ఇలాంటి తప్పుడు నిధుల దుర్వినియగా నిర్ణయాల తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన తేవొద్దని కోరుతున్నామన్నారు. కేసీఆర్ మూఢనమ్మకాలకు దాసోహమై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ సచివాలయంలో ఏ భవనం కూడా 30 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉపయోగించలేదని, ఇక్కడి భవనాలు 100 సంవత్సరాల కోసం నిర్మించారన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సరిపోయింది సచివాలయమని, ప్రస్తుతం సచివాలయ భవనాల విలువ 1000 కోట్లపైనే ఉంటుందని, అలాంటి భవనాలను కులుస్తున్నాడన్నారు. ప్రస్తుతం 400 కోట్లతో కడతానంటున్న కేసీఆర్ అంచనాలు పెంచుతారని, కొత్త సచివాలయాన్ని నిర్మిస్తానన్న కేసీఆర్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదన్నారు. ఉచిత కేజీ టు పీజీ విద్య అన్న కేసీఆర్ ఆ భవనాలు నిర్మించాలని, కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులకు భవిష్యత్తు కె9సామ్ నూతన విద్య భవనాలు నిర్మించాలని హితవుపలికారు. అమరవీరుల స్తూపం ప్రపంచ వ్యాప్తంగా నిర్మిస్తానన్నాడని, అన్ని కులాలకు భవనాలు నిర్మిస్తానన్నాడని, కానీ, వాటికి లిటికేషన్ ఉన్న భూములు కేటాయించాడని దుయ్యబట్టారు.

తాను మాత్రం 10 ఏకరాలల్లో ప్రగతిభవన్ కట్టుకున్నాడన్నారు. అన్ని కులాలకు సచివాలయంలో ఒక్కో ఫ్లోర్ కేటాయించాలని, ప్రతిపక్షాలను అడిగి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్న తలమాసిన శ్రీనివాస యాదవ్‌కు, అలుగడ్డలు అమ్మిన బుద్ధి ఇంకా పోలేదని విమర్శించారు. పిచ్చిపెట్టినట్టు ఏది పడితే అది కూలగొడుతామంటే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదన్నారు. అమరవీరుల స్తూపం కోసం కేవలం టెంకాయ కొట్టిన కేసీఆర్, అక్కడ తట్టెడు మట్టి తీయలేదని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ భవనాల కూల్చివేతను అడ్డుకోవడానికి రావాలని పిలుపునిచ్చారు.

ఇన్ని వేల కోట్ల ప్రజాధనం వృధా చేస్తానంటే ఊరుకొవ్వమని, త్వరలో దీన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామన్నారు. కేసీఆర్‌ వ్యక్తిగత భవనాలను నిర్మించుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా కొత్త భవనాలు నిర్మిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించాలని కోరారు. ప్రజాధనం వృథా కావొద్దనేదే తమ అభిప్రాయమని పేర్కొన్నారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రికి అసలు ఇక్కడి భవనాల పరిస్థితి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.

భవనాలను పరిశీలించిన తర్వాతే కొత్త నిర్మాణంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సచివాలయాన్ని సందర్శించిన వారిలో తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, విజయరామారావు, కొండేటి శ్రీధర్ తదితరులు ఉన్నారు.