వైఎస్సార్‌‌ఎస్‌యూ అధ్వర్యాన విజయసాయి బర్త్‌డే

119

విశాఖపట్నం: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్‌ఆర్‌ స్టూడెంట్‌ యూనియన్‌ సోమవారం ఘనంగా నిర్వహించింది. ఏయూలోని వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల పాల్గొని కేక్‌ కట్‌చేశారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు చదివే విద్యార్ధులకు కరెంట్‌ అఫైర్స్‌ వివేక్‌ మ్యాగజైన్స్‌ బుక్స్‌ 100 మందికి పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దార్శినికత, ఆదర్శప్రాయంగా విజయసాయిరెడ్డి నిలుస్తారన్నారు. పార్టీలో పనిచేస్తున్న వారికి సముచిత స్తానం కల్పిస్తూ అందరికీ తగిన న్యాయం చేస్తున్నారన్నారు. గత టిడిపి ప్రభుత్వాన్ని గద్దెదింపడంలో విజయసాయి రెడ్డి కీలక పాత్రపోషించారన్నారు. ఓబిసిలకు జనాభా ప్రాతిపదికన చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన చేసిన ప్రతిపాదన చేసిన విజయసాయి రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను ఆదిరోహించాలన్నారు. వర్సిటీ ఆచార్యులు డాక్టర్‌ పేటేటి ప్రేమానందం మాట్లాడుతూ పార్టీ ఆరంభం నుంచి వెన్నుదన్నుగా నిలుస్లూ విజయసాయి రెడ్డి పార్టీని నడిపిస్తున్న విధానం అభినందనీయమన్నారు.

ఆయన తీసుకునే నిర్ణయాలు ఆదర్శంగా ఉంటాయన్నారు. వైఎస్‌ఆర్‌ఎస్‌యూ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు బి.కాంతారావు మాట్లాడుతూ రాజకీయాలలో నూతన ఒరవడికి నాంది పలకడంతో విజయసాయి రెడ్డి పాత్ర కీలకమన్నారు. యువతకు, విద్యావంతులకు సముచిన స్థానం అందిస్తూ అన్ని వర్గాల అభిమానాన్ని చూరగొన్నారన్నారు. పార్టీకోసం పనిచేస్తున్న వారికి ఆయన వెన్నుదన్నగా నిలచి ప్రోత్సహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు టి.సురేష్‌, ఏయూ అధ్యక్షులు బి.మోహన్‌, రాష్ట్ర కార్యదర్శులు ఎం.కళ్యాణ్‌, ఎం.సురేష్‌, బి.జోగారావు, కె.ధీరజ్‌, విద్యార్థి నాయకులు అప్పల నాయుడు, దేవానంద్‌, నవీన్‌, శంకర్‌, రంజిత్‌, వైకుంఠం, ప్రసాద్‌, ఉద్యోగ సంఘాల నాయకులు మెల్లి అప్పలరాజు పెద్దసంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.