అంత‌రిక్ష విభాగం పరిధిలో కొత్త కంపెనీ

135

బెంగళూరు: భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఐఎస్ఆర్ఒ-ఇస్రో) కేంద్రాలు, అంత‌రిక్ష విభాగం (డిఒఎస్‌)లో భాగమైన యూనిట్‌లు చేప‌డుతున్న ప‌రిశోధ‌న, అభివృద్ధి (ఆర్ అండ్ డి) కార్యకలాపాలను వాణిజ్య స‌ర‌ళిలో వినియోగించుకోవ‌డం కోసం డిఒఎస్‌ పరిధిలో ఒక నూతన కంపెనీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఐఎస్ఆర్ఒ కార్య‌క్ర‌మాలను వాణిజ్య స‌ర‌ళిలో ఆచ‌ర‌ణాత్మ‌కం చేసేందుకు ఉద్దేశించిన పలు రంగాలు, మార్గాలు ఈ సరికొత్త కంపెనీ పరిధిలోకి వచ్చి అవ‌కాశాలను అందిపుచ్చుకుంటాయి. చిన్న ఉపగ్ర‌హాలకు సంబంధించిన సాంకేతిక విజ్ఞానాన్ని ప‌రిశ్ర‌మకు బ‌ద‌లాయించ‌డం, ఇందుకోసం కొత్త కంపెనీ డిఒఎస్‌/ఐఎస్ఆర్ఒల నుండి లైసెన్సును తీసుకోవలసివుంటుంది. ప‌రిశ్ర‌మ‌లకు కంపెనీ స‌బ్ లైసెన్సును ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రైవేటు రంగం స‌హ‌కారంతో చిన్న ఉప‌గ్ర‌హ వాహ‌క నౌక (ఎస్ఎల్‌వి)ని త‌యారు చేయ‌డం, ప‌రిశ్ర‌మ ద్వారా పోలర్ ఎస్ఎల్‌విని ఉత్ప‌త్తి చేయ‌డం, ప్ర‌యోగం, ఇంకా అప్లికేషన్ల స‌హా అంత‌రిక్ష ఆధారిత ఉత్పత్తులను, సేవ‌ల‌ను తయారు చేయడం, విక్ర‌యించ‌డం, డిఒఎస్‌లో భాగ‌మైన యూనిట్‌లు, ఇస్రో కేంద్రాలు అభివృద్ధిప‌ర‌చిన సాంకేతిక విజ్ఞానాన్ని బ‌దిలీ చేయడం, కొన్ని ఉప సాంకేతిక ప‌రిజ్ఞానాల‌ను, ఉత్ప‌త్తుల‌ను భార‌త‌దేశం సహా ఇతర విదేశాలలో విక్ర‌యించ‌డం, భార‌త ప్ర‌భుత్వం యోగ్య‌మైన‌ద‌ని భావించిన మ‌రే ఇత‌ర విధినైనా నిర్వ‌ర్తించ‌డం వంటి కార్యకలాపాలను ఈ కొత్త కంపెనీ నిర్వర్తించనుంది.