వీర్యకణాల లోపమా? సంతానలేమా?

120

న్యూఢిల్లీ: ఆరోగ్యం మహాభాగ్యమని ఊరికే అనలేదు పెద్దలు. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించగలమన్న ఆలోచనతోనే ఎన్ని చెడు అలవాట్లు ఉన్నా వంటికి శక్తినిచ్చే ఆహార పదార్ధాలను విస్మరించరాదని చెబుతుంటారు. జీవించడానికి ప్రాణవాయువెంత ముఖ్యమో సంసారానికి లైంగిక సామర్ధ్యం కూడా అంతే కీలకమని నిపుణులు అంటారు.

వీర్యకణాల లోపం సంతానలేమికి ప్రధాన కారణమన్న పరిశోధనలు అనేకం. అయితే, ఈ లోపాలను సరిదిద్దుకునేందుకు ఎంత మంది ప్రయత్నిస్తున్నారు? అందుకే, ఈ చిట్కాలు. మునగ పువ్వులు నీటిలో ఉడికించి అందులో పాలు, చక్కెర కలిపి ప్రతిరోజు తీసుకుంటే వీర్యకణాల లోపాన్ని నివారించవచ్చట.

ఇలా కనీసం మూడు మాసాల పాటు తీసుకుంటే వీర్యకణాల అభివృద్ధితో పాటు శుక్రకణాల చురుకుదనం, పురుషత్వ అభివృధ్ధి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 10 గ్రాముల మర్రిగింజలు, జీలకర్రను నీటిలో మరిగించి వడబోసి పాలు, చక్కెర కలుపుకొని ఉదయం, రాత్రి సేవిస్తే సంతానలేమి, పురుషత్వ లోపాలు క్రమేపీ తగ్గుముఖం పట్టనున్నాయట.

10—15 ఖర్జూరాలను ఆవు పాలలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పాలను తీసివేసీ కొద్దిగా యాలకులు, తేనె కలిపి తీసుకుంటే లైంగికసామర్థ్యం పెరుగుతుందని అంతర్జాతీయ పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. నల్లనువ్వులు, బెల్లం పాకం పట్టి సేవించినా కూడా వీర్యవృద్ధి కలుగడంతో పాటు లైంగిక సామర్థ్యం పెరుగుతుందని రుజువైంది. కొబ్బరిపాలు, పాతబెల్లం, వంకాయ, ఈత పండు, చిక్కుడు, దోసగింజల పొడి, బాదం, బీట్ రూట్ రసం వీర్యపుష్ఠిని కలిగిస్తాయట.

సబ్జామొక్క వేరును చిన్నచిన్న ముక్కలుగా చేసి నమిలితే నీరసం తగ్గి లైంగికసామర్థ్యం పెంచుతుందని భారతీయ ఆయుర్వేద వైద్య నిపుణుల సలహా. బీట్ రూట్ గింజలను మెత్తగా నూరి అందులో తేనె కలిపి తాగినా లైంగికసామర్థ్యం పెరుగుతుందట. మానసిక ఆందోళనలు, భయాలను వదలి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం అన్నిటికంటే ముఖ్యమన్న సూచననూ పరిశోధకులు చేస్తున్నారు.