వీధుల్లో గూడూరు ఎమ్మెల్యే మార్నింగ్ వాక్!

37

నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ ప్రజలతో మమేకమయ్యేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలని నిర్ణయించుకున్న ఆయన నియోజకవర్గం సమస్యలను అధ్యయనం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించారు.

అందుబాటులో ఉన్న దిగువస్థాయి అధికారులతో కలిసి ఆయన వీధుల్లో పర్యటిస్తున్నారు. మార్నింగ్ వాక్‌ సమయంలో ఆయన ప్రజా సమస్యలను పరిశీలిస్తున్నారు. గూడురు కోర్ట్ సెంటర్ దగ్గర ప్రజలతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు.