ప్రజావేదికపై అర్దరాత్రి హైకోర్టు తీర్పు

40

అమరావతి: హైకోర్టు ద్వారా ప్రజావేదిక నిర్మాణం తొలగించకుండా స్టే తేవాలన్న తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ఫలించలేదు. సామాజిక కార్యకర్త పేరుతో ప్రకాశం జిల్లాకు చెందిన పి.శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ అర్జెంట్ పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం రాత్రి విచారణ జరిగింది. అయితే ప్రజావేదిక భవనం కూల్చివేత నిలుపుదల చేయాలన్న పిటిషనర్ వానను హైకోర్టు తిరస్కరించింది. అయితే, కేసు విచారణను మాత్రం 2 వారాలకు వాయిదా వేసింది.

ప్రజావేదిక భవనం కూల్చివేతను తక్షణం నిలిపివేయాలని దాఖలయిన ప్రజాహితవ్యాజ్యంపై బుధవారం తెల్లవారుజాము 2.30 గంటలు దాటిన తర్వాత కూడా హైకోర్టు జడ్జిల ఎదుట విచారణ కొనసాగింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సీతారామమూర్తి, జస్టిస్‌ శ్యాంప్రసాద్‌లు ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి హాజరయ్యారు. ప్రజావేదిక కూల్చడం వల్ల ప్రభుత్వ ధనం వృథా అవుతుందని పిటిషనర్ వాదించారు. అడ్వొకేట్‌ జనరల్‌ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం ప్రజావేదిక కూల్చివేత నిలుపుదలకు నిరాకరించింది.