సినీ నటుడు రామ్‌కు జరిమానా

44

హైదరాబాద్: చార్మినార్‌ వద్ద సోమవారం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా షూటింగ్‌ విరామ సమయంలో సిగరెట్‌ కాల్చినందుకు ఆ చిత్ర కథానాయకుడు రామ్‌కు పోలీసులు రూ.200 జరిమానా విధించారు. చార్మినార్‌ పరిసరాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చార్మినార్‌ పోలీసులు తెలిపారు.

రామ్‌తో కలిపి ఇప్పటికి వరకు చార్మినార్‌ పరిసరాల్లో సిగరెట్‌ కాల్చిన 22 మందికి ‘కోప్టా’(సిగరేట్‌ అదర్‌ టోబాకో ప్రొడక్ట్‌) చట్టం కింద జరిమానాలు విధించినట్లు ఎస్సై డి.పండరి వివరించారు.