మహిళల్ని వేధించే రుతుక్రమం!

311
  • వాయిదా వేయడం ద్వారా ఆరోగ్యం?

ఔను. సంప్రదాయబద్దమైన కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కూడా ఎలాంటి వైద్యం, మందులు లేకుండానే రుతుక్రమాన్ని వాయిదా వేయవచ్చు. ప్రయోగాత్మకంగా రుజువైన ఈ విధానాలపైనే ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. 12-50 సంవస్సరాల వయస్సు కలిగిన ప్రతీ ఒక్క మహిళకు రుతుక్రమం వస్తుంది. ఈ భౌతిక పరిస్థితి ప్రతీఒక్క స్త్రీలో స్త్రీ తత్వాన్ని బయటకు తెస్తుంది. కానీ, రుతుక్రమ సమయంలో ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క విధంగా బాధను అనుభవిస్తుంది.

నొప్పులు, ఇతర బాధల వలన స్త్రీ రుతుక్రమ బాధను అనుభవిస్తుంది. కొన్ని మతపరమైన సమస్యల వలన మీరు రుతుక్రమ సమయంలో ఎక్కడకు వెళ్ళలేక పోతుంటారు. కొన్ని అనివార్య సందర్భాలలోను, పరిస్థితుల్లోనూ రుతుక్రమంలో ఉండటం చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని టాబ్లెట్స్ , మందులు ఉన్నవి రుతుక్రమాన్ని ఆలస్యం చేయడానికి. కానీ, వాటిని వాడటం వలన భవిష్యత్తులో పునరుత్పత్తి చేసే అవయవంకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువలన సహజ నివారణల ద్వారా రుతుక్రమాన్ని వాయిదా వేయడం ఉత్తమం. చాలా మంది రుతుక్రమాన్ని వాయిదా వేయడం మంచి పద్ధతి కాదు అని అనుకుంటారు. కాని కొన్నిసార్లు ఇలా చేయడం కూడా ఆరోగ్యానికి మంచిదట.

మహిళలకు రుతుక్రమం ముందుగా, వెనుకగా రావడానికి చాలా కారణాలు ఉన్నవి. మతపరమైన సందర్భాలలో రుతుక్రమంలో ఉన్న స్త్రీ ఎక్కడకు వెళ్ళడానికి వీలు ఉండదు. మీకు మీ పెళ్లి సందర్భంలో రుతుక్రమం వచ్చిన మీరు పూజలు చేయడానికి వీలు ఉండదు. మీరు కొన్ని ఆర్టిఫీషియల్, నేచురల్ పద్ధతుల ద్వారా రుతుక్రమాన్ని వాయదా వేయవచ్చు. కాని ఆర్టిఫీషియల్ పద్ధతులను పాటించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నేచురల్ పద్ధతుల ద్వారా రుతుక్రమాన్ని వాయదా వేయడం వలన ఆరోగ్యానికి ఎటువంటి హానీ ఉండదట. కారంగా ఉండే ఆహరం తీసుకోవడం వలన మీ శరీరంలో రక్త ప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. మీరు మీ రుతుక్రమాన్ని వాయిదా వేయాలి అనుకుంటే కారంగా ఉన్న ఆహారం తినకూడదు. కారంగా ఉన్న ఆహారం అనగా వెల్లుల్లి, మిరపకాయలు, మిరియాలు.

మీరు పూర్తిగా ఈ ఆహారాన్ని మానివేయడం వలన రుతుక్రమాన్ని వాయిదా వేయవచ్చు. యెల్లో టిన్చార్లు, షేఫేర్డ్స్ పురస్ తీసుకొని ఎండపెట్టి పొడి చేయాలి. దానిని తినడం వలన రుతుక్రమాన్ని వాయిదా వేయవచ్చు. షేఫేర్డ్స్ పురస్ని అధిక రక్తస్రావం జరిగే సమయంలో ఆపడానికి ఉపయోగిస్తారు. అందువలన దీనిని రుతుక్రమ వాయిదాకు కూడా ఉపయోగించవచ్చు. పైల్స్తో బాధపడే వారికి యెల్లో టిన్చార్లు మంచి మందుగా పని చేస్తుంది. అలానే ఇది జలుబు, జ్వరం వచ్చిన వారికి కూడా మంచి మందుగా పని చేస్తుంది. ఇకనుంచి దీనిని రుతుక్రమ వాయిదాకి కూడా వాడండి.

మానసిక ఒత్తుడుల వలన కూడా రుతుక్రమం ముందుగా వచ్చే అవకాశం ఉంది. ఈ మానసిక ఒత్తుడులు రోజూ వ్యాయామం చేయడం వలన తగ్గుతాయి. మానసిక ఒత్తుడులను దూరం చేయడమే కాకుండా శరీరానికి ఫిట్నెస్ని ఇస్తుంది. కొంతమంది మహిళలలో రుతుక్రమం నెలలో రెండు సార్లు రావడం గమనిస్తూ ఉంటాము. ఫిసికల్ ఫిట్నెస్ లేకపోవడం వలన అల జరుగుతుంది. వ్యాయామం చేయడం వలన మీరు ఫిసికల్ ఫిట్నెస్ని పొందవచ్చు. రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఇతర వ్యాయామ క్రియలు చేయడం వలన ఫిసికల్ ఫిట్నెస్ని పొందవచ్చు. రుతుక్రమాన్ని సరిగా వచ్చేటట్లు చేస్తుంది.

మీరు తీసుకునే ఆహరాన్ని బట్టి రుతుక్రమ రోజులు పెరగటం, తగ్గటం జరుగుతూ ఉంటుంది. మీకు కందిపప్పు మార్కెట్లో లభిస్తుంది. కందిపప్పు తీసుకొని సూప్ తయారు చేయండి. మీరు మీ రుతుక్రమాన్ని వాయిదా వేయాలి అనుకుంటే ఏ రోజు వరకు రుతుక్రమం వాయిదా చేయాలో ఆ రోజు వరకు సూప్ తీసుకోవాలి. సూప్ తయారు చేయు విధానం తెలుసుకోండి. కందిపప్పును బాగా వేయించి, గ్రైండర్ సహాయంతో పౌడర్ తయారు చేసి నీటిలో బోయిల్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన మీరు మీ రుతుక్రమాన్ని వాయిదా వేయవచ్చు. నీటిని రోజు తగిన మోతాదులో తీసుకోవాలి.

నీటిని ఎక్కువగా తీసుకోవడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మీరు నీటిని తక్కువగా తీసుకుంటే రుతుక్రమంలో చాలా సమస్యలు వస్తాయి. మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే నీటిని ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఒత్తుడులు ఎక్కువగా ఉండటం వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. మీకు రుతుక్రమం క్రమంగా రావడం లేదు అంటే మీరు చాల ఒత్తుడులకు గురి అవుతున్నారు అని అర్ధం. మీరు యోగా చేయడం ద్వారా ఒత్తుడుల నుంచి ఉపసమనం లభిస్తుంది. ఎక్కువగా పద్మాసనం మీద కూర్చొని శ్వాస మీద శ్రద్ధ ఉంచడం వలన ఒత్తుడుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ ఒత్తిడులను అదుపు చేసుకున్న తరువాత రుతుక్రమాన్ని వాయిదా వేయవచ్చు. వెనిగర్ని ఉపయోగించి నెచురల్గా రుతుక్రమాన్ని వాయిదా వేయడం.

ఒక గ్లాస్లో 3-4 స్పూన్స్ వెనిగర్ కలిపిన నీటిని తీసుకోవడం వలన మీరు 3-4 రోజుల వరకు రుతుక్రమాన్ని వాయిదా వేయవచ్చు. చాల రోజులవరకు రుతుక్రమం రాకుండా ఉండాలి అంటే ఇలా వెనిగర్ కలిపినా నీటిని రోజుకు 2-3 సార్లు తీసుకోవాలి. మీరు మీ రుతుక్రమాన్ని వాయిదా వేయాలి అంటే ఒక సులువైన పద్ధతి కొత్తిమీరను ఉపయోగించడం. కొత్తిమీర మనకు చాల సులువుగా లభిస్తుంది. కొత్తిమీరను నీటిలో 20 నిమిషములపాటు బోయిల్ చేయాలి. బోయిల్ చేసిన నీటిని వడపోసి, ఆ నీటిలో తేనే కలుపుకొని రోజుకి రెండుసార్లు త్రాగటం వలన మీ రుతుక్రమాన్ని వాయిదా వేయవచ్చు.