అందానికి ప్రతిబంధకాలు మొటిమలు!

354
  • వంటింటి చిట్కాలతో నివారణ ఉత్తమం

హైదరాబాద్, జూన్ 22 (న్యూస్‌టైమ్‌): టిమలు వాటి మచ్చలతో మీరు బాధపడుతున్నారా? ఎదుటి వారికి మీరు మీ ముఖము చూపించలేకున్నరా? అయితే మీరు బాధ పడవలసిన అవసరం లేదు. కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి మీరు మీ మొటిమలను వాటి మచ్చలను దూరం చేయవచ్చు. మొటిమలు రావడం వలన మీ ముఖముపై నల్ల మచ్చలు ఏర్పడుతున్నవి. సూర్యరశ్మి మీ చర్మం మీద ఎక్కువగా పడటం వలన కూడా నల్ల మచ్చలు ఏర్పడతాయి. బయటకు వెళ్ళేటప్పుడు మీ చర్మానికి సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేయడం ఎంతైనా అవసరం, బయటకు వెళ్ళేటప్పుడు క్రింద ఇవ్వబడిన గృహ చిట్కాలను పాటించడం వలన మొటిమలు వాటివల్ల కలిగే మచ్చల నుంచి విముక్తి చెందవచ్చు.

కెమికల్ ప్రొడక్ట్స్ వాడటం కన్నా మీరు గృహ చిట్కాలను వాడటం మంచిది. దీని ద్వారా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతే కాకుండా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. మీ చర్మం మొటిమలు, మచ్చలు లేకుండా అందంగా కనిపిస్తుంది. ఒక టమాటోని తీసుకొని పేస్టు చేసి టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి 20 నిమిషముల తరువాత వేడి నీటితో కడగాలి. కలబంద ఆకుల నుంచి గుజ్జుని తీసి 5 నిమిషముల పాటు ఎండలో ఎండపెట్టాలి.

తరువాత దానిలో ఎండిన నిమ్మపండు రసాన్ని 5-6 చుక్కులు కలపవలెను. ఆ పేస్టు ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత నీటితో కడగాలి. ఇలా చేయడం ద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. ఉల్లిపాయలో సూక్ష్మజీవ నిరోధక లక్షణాలు ఎక్కువగా ఉన్నవి, అందువలన ఇది మొటిమలను వాటి మచ్చలను తొలగించుటకు ఉపయోగపడుతుంది. ఒక ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసి, మిక్సర్ సహాయంతో పేస్టు చేయాలి. తరువాత ఆ పేస్టు నుంచి నీటిని వడపోసి పిప్పిని మాత్రమే ముఖానికి అప్లై చేసి కొన్ని నిమిషముల తరువాత ముఖాన్ని నీటితో కడగాలి.

రెండు టేబుల్ స్పూనుల గంధపు పొడిని తీసుకొని సరిపడే గులాబీ నీటిని కలిపి పేస్టు తయారు చేయాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఎండిన తరువాత నీటితో కడగాలి. చిటికెడు పసుపు తీసుకుని దానిలోకి నిమ్మరసాన్ని కలిపి పేస్టు తయారు చేయాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి నీటితో కడగాలి. ఇలా చేయడం ద్వారా తొందరగా మీ ముఖముపై మచ్చలు తొలగిపోతాయి. ఇలా రోజు చేయడం వలన మీరు ఇంకా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. బంగాళదుంప పేస్టు చేసి దానిలోకి కొంచెం తేనెని కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత మంచి నీటితో కడగవలెను.

ఇలా చేయడం ద్వారా మీ ముఖము మీద ఉన్న నల్ల మచ్చలు దూరం అవుతాయి. అలానే కాకుండా బంగాళదుంప ముక్కతో మచ్చలు ఉన్న దగ్గర 5 నిమిషముల పాటు రుద్దుతూ ఉండాలి, 15 నిమిషములు అలానే ఉంచి మంచి నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వలన కూడా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. ఈ పేస్టు తయారు చేయడం చాలా సులభం. ఒక టేబుల్ స్పూన్ ఉల్లి రసం, ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం, ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ తీసుకొని బాగా కలపాలి. ఆ పేస్టును ముఖానికి అప్లై చేసి కొంచెం సేపు నెమ్మదిగా మసాజ్ చేస్తూ ఉంచి 20 నిమిషముల తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడగాలి.

ఇది తొందరగా నల్ల మచ్చలు పోవుటకు సహాయ పడుతున్నది. ఉల్లిపాయలో సల్ఫర్, విటమిన్లు ఎక్కువగా ఉండటం వలన, అల్లంలో అల్లిసిన్ అనే కారకం ఉండటం వలన యాంటీఫంగల్, యాంటీఏజింగ్ లక్షణాన్ని కలిగి ఉంటుంది. చర్మానికి చాలా మంచిది. నిమ్మరసంలో విటమిన్ సీ ఎక్కువగా ఉండటం వలన ఇది చర్మంలోని విషపు కణాలను దూరం చేస్తుంది. అలానే మొటిమల వలన వచ్చిన నల్ల మచ్చలను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. నిమ్మరసాన్ని మచ్చలు ఉన్న దగ్గర అప్లై చేయడం వలన మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. ఇలా రోజుకి రెండుసార్లు చేయడం ఇంకా మంచిది. దోసకాయ పేస్టుతో పాలను కలపాలి దానిలో కొంచెం నిమ్మరసం కలిపి పేస్టు తయారు చేయాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి 10 నిమిషముల తరువాత మంచి నీటితో కడగాలి.