ఏపీ క్రైస్తవ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షునిగా అనిల్‌పాల్

48

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ కులాల సంక్షేమ సంఘం విశాఖపట్నం జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ ఎం. అనిల్ పాల్‌ను నియమించామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కులిడి సురేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు ఆయన అందజేసిన ఉత్తర్వులను పాల్ మీడియాకు విడుదల చేశారు. క్రైస్తవులకు అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, వీటి పరిష్కారానికి తమ సంఘం కృషి చేస్తుందని, అన్ని డినామినేషన్‌లకు సంబంధించిన క్రైస్తవులు ఏకతాటిపైకి వచ్చినట్లయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి వాటిని తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు.

నూతనంగా నియమితులైన విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు అనిల్ పాల్ మాట్లాడుతూ క్రైస్తవుల సమస్యల పరిష్కారమే తమ సంఘం ధ్యేయమన్నారు. కార్యక్రమంలో విశాఖ నగర శాఖ అధ్యక్షుడు ఎ.జె సాల్మన్, సంఘం ప్రతినిధులు కొయ్య శ్రీనివాసరెడ్డి, శ్యామ్ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.