తెలుగు రాష్ట్రాల‌లో విడుద‌ల కానున్న ‘టెంప‌ర్’ రీమేక్

62

చెన్నై, మే 26 (న్యూస్‌టైమ్): పూరి జ‌గ‌న్నాథ్‌, ఎన్టీఆర్ కెరియ‌ర్‌కి మంచి బూస్టప్ ఇచ్చిన చిత్రం ‘టెంప‌ర్‌’. ఈ చిత్రాన్ని త‌మిళంలో విశాల్ రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ‘అయోగ్య’ అనే టైటిల్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ఏఆర్‌ మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌మోహన్ తెర‌కెక్కించారు. రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టించింది. పోలీస్ ఆఫీస‌ర్‌గా విశాల్ త‌న విశ్వ‌రూపం చూపించాడు.

ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రానికి అభిమానులు, క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో డ‌బ్ చేసి విడుద‌ల చేయాల‌ని మేకర్స్ అనుకుంటున్నార‌ట‌. మ‌ల్కాపురం శివకుమార్ తెలుగు డ‌బ్బింగ్ రైట్స్ ద‌క్కించుకోగా, జూన్‌లో మూవీ విడుద‌ల చేయ‌నున్నారు.

అయోగ్య చిత్రం చివ‌రి గంటలో వ‌చ్చే సీన్స్ అన్నింటిని పూర్తిగా మార్చేశార‌ట‌. ఇవి తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా మంచి వినోదం అందిస్తాయ‌ని భావిస్తున్న నేప‌థ్యంలో ‘అయోగ్య’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల‌లో విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేశారు.