కూతుళ్లకి గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పిన రాజ‌శేఖ‌ర్

55

హైదరాబాద్, మే 26 (న్యూస్‌టైమ్): రాజ‌శేఖ‌ర్, జీవిత‌ల కూతుళ్ళు శివానీ, శివాత్మిక‌లు వెండితెర ఆరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. శివానీ, ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్‌తో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో అడ‌వి శేష్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇక శివాత్మిక ‘దొర‌సాని’ చిత్రంతో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచ‌నుంది. ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవరకొండ హీరోగా న‌టిస్తున్నాడు. అతి త్వ‌ర‌లో ఇద్దరు ముద్దుగుమ్మ‌లు వెండితెర‌పై అల‌రించ‌నున్నారు.

మ‌రో వైపు రాజ‌శేఖ‌ర్ ‘క‌ల్కి’ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌రించేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఈ చిత్రం 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ చిత్రం కాగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కుతుంది. అ! ఫేమ్ ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. క‌ట్ చేస్తే రాజ‌శేఖ‌ర్ త‌న ఇద్దరు కూతుళ్ళని ట్విట్ట‌ర్ మాథ్య‌మంలోకి ఆహ్వానిస్తూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ పెట్టారు. రానున్న రోజుల‌లో ఈ ఇద్ద‌రు భామ‌లు త‌మ సినిమాలకి సంబంధించిన ప్ర‌మోష‌న్స్‌ని సోష‌ల్ మీడియా వేదికగా జోరుగా ప్ర‌చారం చేసుకోనున్నార‌న్న‌మాట‌. ఇక, విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌, రాజ‌శేఖ‌ర్ చిన్న కూతురు శివాత్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న చిత్రం ‘దొర‌సాని’.

తెలంగాణ నేప‌థ్యంలో ఎమోష‌నల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఆర్ మ‌హేంద్ర తెర‌కెక్కిస్తున్నారు. సురేష్‌‌బాబు సమర్పణలో ‘పెళ్లి చూపులు’ కో ప్రొడ్యూసర్ యష్ రంగినేని – మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూలై 5న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇందులో క‌విత రాసి ఉన్న పేప‌ర్‌పై ప్ర‌ధాన పాత్ర‌ధారుల చేతుల‌ని చూపించారు. మే 30న చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలిపారు.