ఆకట్టుకునేలా సమంతా ‘ఓ బేబీ’ టీజర్

62

హైదరాబాద్, మే 26 (న్యూస్‌టైమ్): అక్కినేని సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ సినిమా టీజర్ ఆకట్టుకునేలా ఉంది. నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాగశౌర్య, రావు రమేశ్, లక్ష్మీ, డాక్టర్ రాజేంద్రప్రసాద్ కీల‌క‌ పాత్రల్లో నటిస్తున్న ‘ఓ బేబీ’ సినిమా టీజర్‌ను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ఇప్పటికే ‘ఓ బేబీ’ ఫస్ట్ లుక్ విడుదలయి సంచలనాలు సృష్టించింది.

తాజాగా రిలీజ్ అయిన టీజర్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో? కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి ఈ సినిమా రిమేక్. సినిమా టీజర్ విషయానికి వస్తే? టీజర్ మాత్రం ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంటుంది. టీజరే ఇంత వినోదాత్మకంగా ఉంటే మూవీ ఇంకెంత వినోదాన్ని పంచుతుందోనని సినీ అభిమానులు అంచాలు వేస్తున్నారు. ‘ఓ బేబీ’లో సమంత సింగర్‌గా కనిపిస్తున్నారు. సినిమాలోని డైలాగ్స్, సమంత నటన అదుర్స్ అనిపిస్తుంది.