ఆకట్టుకుంటున్న డ‌బుల్ అభినేత్రి ట్రైల‌ర్

50

చెన్నై, మే 26 (న్యూస్‌టైమ్): ప్ర‌భుదేవా, త‌మ‌న్నా కాంబినేష‌న్‌లో రూపొందిన హార‌ర్ చిత్రాలు అభినేత్రి 2, ఖామోషీ. ఈ రెండు చిత్రాలు మే 31న విడుద‌ల కానుండ‌గా, చిత్రానికి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు. ఇటీవ‌ల విడుద‌లైన ‘ఖామోషీ’ ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా ‘అభినేత్రి 2’ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో డ‌బుల్ యాక్ష‌న్, డ‌బుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, డ‌బుల్ డ్యాన్స్ ఉంటుంద‌ని టీం తెలిపింది.

మ్యూజిక‌ల్ హార‌ర్ కామెడీ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి ఫ‌న్ అందించ‌డం ఖాయ‌మ‌ని టీం చెబుతుంది. ‘అభినేత్రి’ చిత్రానికి విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఐషారీ కే గ‌ణేష్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కోవై స‌ర‌ళ‌, ఆర్‌జే బాలాజీ, నందిత చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించారు.