తిండిలో తనవిరీర్చే తవా గోష్ట్‌!

202

మటన్‌-కిలో, గరం మసాలా పొడి-2 టీస్పూన్లు, అల్లం వెల్లుల్లి-2 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి- 50 గ్రా, ఉల్లిపాయలు-నాలుగు, టొమాటోలు- రెండు, కారం-2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి-నాలుగు, పుదీనా-కట్ట, ఆమ్‌చూర్‌ పొడి- టీ స్పూను, ఉప్పు-సరిపడా, కొత్తిమీర తురుము-టేబుల్‌ స్పూను, గసగసాలు-టేబుల్‌ స్పూను, గరం మసాలా దినుసులు: యాలకులు-రెండు, ధనియాలు-టీ స్పూను, జాజికాయ- ఒకటి, జాజిమొగ్గ-ఒకటి, దాల్చిన చెక్క- అంగుళం ముక్క, లవంగాలు- నాలుగు, జాపత్రి-రెండు.

తయారీ విధానం… మటన్‌ ముక్కల్ని కడిగి పక్కన ఉంచాలి. గరం మసాలా దినుసులన్నింటినీ పలుచని బట్టలో మూట కట్టాలి. ప్రెషర్‌ పాన్‌లో మటన్‌ ముక్కలు, ఉప్పు, కారం, మసాలా దినుసులు మూట వేసి ఉడికించాలి. మందపాటి బాణలిలో నెయ్యి వేసి ఉడికిన మటన్‌ ముక్కల్ని వేసి వేయించాలి.

మరో బాణలిలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి ఉల్లిముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లంవెల్లుల్లి తురుము వేసి వేయించాలి. తరువాత మసాలా పొడి వేసి కలపాలి. ఆమ్‌ చూర్‌పొడి, పుదీనా ఆకులు కూడా వేసి కలిపి ఈ మిశ్రమాన్ని మటన్‌ ముక్కల మీద వేసి కలపాలి. చివరగా గసగసాలు, కొత్తిమీర తురుము కూడా చల్లి దించాలి.