ప్రభుత్వాసుపత్రుల్లో పెరిగిన ప్రసవాలు

435

మాతా శిశు మరణాలను తగ్గించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చేసిన ప్రయత్నాలవల్ల ఏపీలో ఇప్పుడు 99.50 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. అయితే, ఆసుపత్రులలో ప్రసవం ఖర్చుతో కూడుకున్నది కావడంతో పేదలు వెనక్కి తగ్గుతున్నారు. ఈ పరిస్థితుల్లో పేదకు అండగా నిలిచి ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం గర్భిణులు పైసా చెల్లించకుండా కాన్పు చేయించుకునేలా ‘తల్లి సురక్ష’ పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.

ఈ పథకం ప్రకారం దారిద్య్రరేఖకు దిగువనున్న నిరుపేద కుటుంబాలలోని గర్భిణులకు ఉచిత కాన్పు సేవల్ని ప్రైవేటులోనూ అందిస్తారు. అందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. సహజ ప్రసవానికి రూ.8 వేలు, సిజేరియన్‌కు రూ.14,500 చెల్లిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వంపై రూ.500 కోట్ల భారం పడుతున్నప్పటికీ ప్రసవ సమయంలో తల్లుల మరణాల రేటును తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేస్తోంది.