ఓటేసిన భారత తొలి ఓటరు

101

న్యూఢిల్లీ, మే 19 (న్యూస్‌టైమ్): ఆదివారం జరిగిన లోక్‌సభ సాధారణ ఎన్నికల చివరి (7వ) విడత పోలింగ్‌లో భారత తొలి ఓటరు శ్యామ్‌ సరన్‌ నేగి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కల్పా పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా నేగికి ఈసీ అపూర్వ స్వాగతం పలికింది. డప్పు చప్పుళ్లతో స్వాగతం పలుకుతూ పోలింగ్‌ బూత్‌ వరకూ తీసుకొచ్చి దగ్గర ఉండి మరీ ఎన్నికల అధికారులు ఓటు వేయించారు. ఆయన పోలింగ్ బూత్‌కు వచ్చినప్పుడు మిగతా ఓటర్లు కూడా సహకరించారు. ఆయనతో ఫొటోలు దిగారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని కల్పా ప్రాంతానికి చెందిన శ్యామ్ సరన్ నేగి ఓ శతాధిక వృద్ధుడు. ఆయన వయసు 102 సంవత్సరాలు. 1951లో జరిగిన భారత తొలి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన భారతీయుడు శ్యామ్ శరన్ నేగీనే. అందుకే ఆయనను ఈసీఐ ఓ సెలబ్రెటీలా గౌరవించింది.