నేడు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌ ప్రారంభం

55

హైదరాబాద్, మే 18 (న్యూస్‌టైమ్): మెట్రో కారిడార్‌-3లోని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మెట్రోస్టేషన్‌ను శనివారం ప్రారంభం కానుంది. సాంకేతిక, నిర్మాణ పనుల వల్ల ఆలస్యంగా అందుబాటులోకి వచ్చింది జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌. ఈ స్టేషన్‌ శనివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో నాగోల్‌ – హైటెక్‌సిటీ మార్గంలో అన్ని స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి.

అమీర్‌పేట – హైటెక్‌సిటీ మెట్రో మార్గం ఈ ఏడాది మార్చి 20న అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మార్గంలో మొత్తం ఎనిమిది స్టేషన్లు ఉండగా, ఈ కారిడార్‌ ప్రారంభ సమయంలో ఐదు స్టేషన్లను అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన మాదాపూర్‌, పెద్దమ్మగుడి, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు స్టేషన్లను వరుసగా అందుబాటులోకి తీసుకువచ్చారు.