నోరూరించే ఆలివ్‌ మటన్‌

177

మటన్‌-500 గ్రాములు, ఉల్లిపాయలు (పెద్దవి)-2, వెల్లుల్లి రెబ్బ- 1, అల్లం ముక్క- 1, ధనియాల పొడి- 2 చిన్న చెమ్చాలు, యాలకులు-2, జీలకర్ర-2 చిన్న చెమ్చాలు, దాల్చిన చెక్క-1ముక్క, ఆలివ్‌ ఆయిల్‌-1 టేబుల్‌ స్పూను, పెరుగు, కారం, ఉప్పు- రుచికి సరిపడా. తయారీ విధానం… మటన్‌ను శుభ్రంగా కడగాలి.

కడాయిలో నూనె వేసి వేడి చేసుకుని అందులో మసాలా దినుసులు,ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న మంటపై వేయించాక అందులో మటన్‌ వేసుకుని కొద్దిసేపు పెద్ద మంటపై ఉడికించాలి. నీళ్లకు బదులుగా మటన్‌లో పెరుగు వేసుకుని అది ఇంకేవరకు పెద్ద మంటపై ఉంచాలి. మటన్‌ ఉడికాక చివరగా కొత్తిమీర ఆకులను తరిగి అందులో వేయాలి.

అదే విధంగా ఘడె మసాలా తయారీ కూడా చాలా సులువే. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు… మటన్‌- కిలో, నూనె- అర కప్పు, దాల్చిన చెక్క- అంగుళం సైజు ముక్కలు రెండు, పలావు ఆకులు- 4, యాలకులు- 10, లవంగాలు-12, ఉల్లిపాయలు-4, అల్లం తురుము- 2 టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి తురుము-2 టేబుల్‌ స్పూన్లు, టొమాటోలు-3, ఉప్పు- సరిపడా, మిరియాలు-2 టీ స్పూన్లు, ఎండు మిర్చి-5, ధనియాలు-2 టేబుల్‌ స్పూన్లు. తయారీ విధానం… ఉల్లి, టొమాటోలు సన్నగా తరగాలి.

మందపాటి పాన్‌ లైదా బాణలిలో నూనె వేసి అన్ని రకాల మసాలా దినుసులూ వేసి వేయించాలి. తరువాత మటన్‌ ముక్కలు కూడా వేయించాలి.తరువాత ఉల్లిముక్కలు టొమాటో ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి చుట్టూ పిండితో మూసేసి దమ్‌ చేసినట్లుగా సుమారు అరగంట సేపు ఉడికించి తీయాలి.