సీతారాం ఏచూరీతో చంద్రబాబు భేటీ

124

న్యూఢిల్లీ, మే 17 (న్యూస్‌టైమ్): ఎన్డీయే ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతలందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం దేశరాజధాని హస్తినలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల ఫలితాల ఆధారంగా అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలిద్దరూ చర్చించారు. ఎన్డీయేతర పక్షాలను సమన్వయపర్చడంలో భాగంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఇందులో భాగంగా ఆయన పలు పార్టీల జాతీయ నేతలతో భేటీ అవుతున్నారు. పార్టీ నేతలు కిమిడి కళావెంకట్రావ్, సీఎం రమేష్, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తదితరులతో కలిసి చంద్రబాబు ఎన్డీయేతర పక్షాలను కలుస్తున్నారు.