యూపీఎస్‌సీ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు

38

చిత్తూరు, మే 16 (న్యూస్‌టైమ్): జూన్ 2వ తేదీ జరిగే యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని న్యూఢిల్లీలోని కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్విస్ సెక్రటరీ రాజేష్ గుప్తా పేర్కొన్నారు.

జూన్ 2వ తేదీ జరిగే ప్రిలిమినరీ పరీక్షలకు సంబందించిన ఏర్పాట్లు, పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో న్యూఢిల్లీ నుండి యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ సెక్రటరీ రాజేష్ గుప్తా, జాయింట్ సెక్రటరీలు విశాల్, రాజ్‌కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ సెక్రటరీ మాట్లాడుతూ జూన్ 2వ తేదీ (ఆదివారం) ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 గంటల నుండి 4:30 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయని, పరీక్ష కేంద్రాలకు అభ్యర్ధులు పరీక్ష సమయానికి ముందస్తుగానే చేరుకోవాలని, ఈ అడ్మిట్ కార్డ్‌లో నమోదు చేసిన వెన్యూలోనే అనుమతించడం జరుగుతుందని, మొబైల్ ఫోన్స్ ఐ.టి గాడ్జెట్స్, బ్లూటూత్, ఇతర కమ్యూనికేషన్స్ జరిపే వస్తువులు పరీక్ష కేంద్రాలలో నిషేధమన్నారు.

పరీక్ష ప్రశ్న పత్రాలు భద్రపరిచే ప్రభుత్వ ట్రెజరీ/స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రత వుండాలని తెలిపారు. ఈ‌ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన జిల్లా కలెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్నా మాట్లాడుతూ జిల్లాలో పది పరీక్ష కేంద్రాలు తిరుపతిలో ఏర్పాటుచేయడం జరిగిందని, 4,639 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరవుతునట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టర్‌తో పాటు జెసి.గిరిషా, డిఆర్వో గంగాధర్ గౌడ్, సి.సెక్షన్ పర్యవేక్షకులు కృష్ణయ్య డిటినాగార్జున పాల్గొన్నారు.