ఆంగ్ల భాష వద్దు.. సంస్కృతమే ముద్దు: ప్రభాకరశర్మ

30

ఏలూరు, మే 16 (న్యూస్‌టైమ్): ఆంగ్ల భాష వద్దని, సంస్కృతమే ముద్దని ఆంధ్ర గీర్వాణి సంసృత పండితులు దోర్భల ప్రభాకర శర్మ అన్నారు. జంగారెడ్డిగూడెంలోని నూకాలమ్మ ఆలయం ప్రతిష్టాపన పూజ కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఆయన చేసిన ఆధ్యాత్మిక ప్రవచనం ఆకట్టుకుంది. నూకాలమ్మ తల్లి అంటే నవ దుర్గాదేవిగా అభివర్ణించారు. జయంతి, మంగళ, కాళీ, భద్రకాళీ, కపాళిని, దుర్గ, క్షమ, శివ, దాత్రిగా నూకా లమ్మను స్థుతించవచ్చన్నారు.

జయంతి అంటే ఎప్పుడూ విజయాన్ని పొందేదని, మంగళ అంటే అ మంగళం లేనిదని, శుభాలకు కల్పించేదిగా, కాళీ అంటే నల్లని వర్ణం కలిగినదని, భద్రకాళీ అంటే అందరికి మంచి కాలాని ఇచ్చేదని, మంచి ఫలాలను అందించేదని, కపాళిని అంటే చేతిలో కపాళి ని ధరించేదిగానూ, దుష్టశక్తులను సంహరించేదిగా, దుర్గ అంటే అన్ని చోట్లకి వెళ్లేది, అన్ని సమక నార్చేదిగానూ, క్షమ అంటే ఓపికను ఇచ్చేదిగానూ, శివ అంటే మంచి శుభాలను అందించేదిగా, ఏ రాత్రి అంటే అన్నింటిని భరించేదీ భూమిగా అభివర్ణించారు. నూకాలమ్మ ఆలయంలో ఉన్న శ్రీ చక్రా న్నికి 9 అవరణాలు ఉన్నాయని, పృద్వి, అపహ, తేజహ, వాయుహు, ఆకాశం, మన, బుద్ధి, అపంకారహ, జీవులుగా పిలుస్తామన్నారు.

జంగారెడ్డిగూడెంలో ఇలవేల్పుగా ఉన్న నూకాలమ్మ ఆలయంలో మరెన్నో విశేషాలతో కూడిన దేవతామూర్తులు ఆలయ ప్రకారాలలో ఏర్పాటు చేయడం జ రిగిందన్నారు. నూకలను అందించే నూకాలమ్మను ప్రతి ఒక్కరూ స్థుతించాలన్నారు. నేటి కాలంలో విదేశీ సంస్కృతి కారణంగా నేటి తరం ఆధ్యాత్మికతకు దూరంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చే శారు. తెలుగు, సంస్కృత భాషాలను పిల్లలకు నేర్పించాలని కోరారు. కొన్ని లక్షలు ఖర్చుపెట్టి నూ కాలమ్మ తల్లి ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలను వారం రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహించడం అందరి సమిష్టి కృషేనన్నారు.

ఆలయ కమిటీకీ, వెంకట రమణ శాస్త్రి సిద్ధాంతిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మనోజ్, గౌరవ అధ్యక్షులు రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.