మ్యాజిక్ కళాకారులకు మంత్రి అభినందన

100

హైదరాబాద్, మే 16 (న్యూస్‌టైమ్): వియత్నంలో జరిగిన అంతర్జాతీయ మ్యాజిక్ ఫెస్టివల్‌లో భారతదేశం తరుపున తెలంగాణకు చెందిన ప్రముఖ మెజిషియన్ సామల వేణు బృందం ప్రదర్శన నిర్వహించి, ప్రముఖ మెజిషియన్ల ప్రశంసలు పొందినందుకు రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సచివాలయంలో అభినందించారు.

ఈ ఫెస్టివల్‌లో తెలుగు యూనివర్సిటీ మొదటి బ్యాచ్‌కు చెందిన సీ నరేష్ ఈ మ్యాజిక్ ఫెస్టివల్‌లో మంచి ప్రతిభను కనబరిచి ప్రముఖ మెజిషియన్లు ప్రసంశలు పొందారని మంత్రికి వివరించారు. అంతర్జాతీయ మ్యాజిక్ ఫెస్టివల్‌లో 150 మంది ప్రముఖ మెజిషియన్లు పాల్గొన్నా ఈ ఫెస్టివల్‌లో మన దేశం నుండి ప్రాతినిధ్యం వహించిన తెలంగాణకు చెందిన ప్రముఖ మెజిషియన్ సామల వేణు బృందాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసించారు.