కౌంటింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

29

చిత్తూరు, మే 16 (న్యూస్‌టైమ్): మే 23న నిర్వహించే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రామైన సీతమ్స్ కాలేజీలలో ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్నా సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక సీతమ్స్ కాలేజీలో కౌంటింగ్‌కి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ కౌంటింగ్‌కు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్&బి అధికారులను ఆదేశించారు. ఈ వాహనాల పార్కింగ్, స్థల పరిశీలన, బ్యారీకేడింగ్, బందోబస్తు అంశాలపై పరిశీలించారు. ఈ సంధర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాలకు కౌంటింగ్ రోజున వచ్చే వాహనాల పార్కింగ్, కౌంటింగ్ కేంద్రాలలో నియోజకవర్గాల అసెంబ్లీ, పార్లమెంట్ లెక్కింఫు రూములలో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత ఆర్వోలను, ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు.