ప్రశాంతంగా పరిషత్‌ ఎన్నికలు: డీజీపీ

24

హైదరాబాద్, మే 16 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో మూడు దశల్లో జరిగిన పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల ముగింపుపై డీజీపీ స్పందిస్తూ ఎన్నికల సంఘం సహకారంతో శాంతిభద్రతల సమస్య రాకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇటు పోలీసు అధికారులు అటు ఎన్నికల సిబ్బంది రాత్రి పగలు అని తేడా లేకుండా ఎన్నికల విధులు నిర్వహించారన్నారు. పోలీసుశాఖలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

పోలీసుశాఖకు తోడ్పడిన ఇతర శాఖలకు ధన్యవాదాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా సహకరించిన ప్రజలకు డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తికావడంపై ప్రజలు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగడానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

ఓటర్లు పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసిందన్నారు. పోలీసులకు సహకారమందించిన ఎన్నికల సంఘం, ఇతర ప్రభుత్వశాఖల అధికారులకు పోలీస్‌శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.