ఆసెట్‌, ఆయీట్‌ ఫలితాలు విడుదల

43

విశాఖపట్నం, మే 16 (న్యూస్‌టైమ్): ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన ఆసెట్‌, ఆయీట్‌ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఏయూ సెనెట్‌ సమావేశ మందిరంలో ఉపకులపతి ఆచార్య జి. నాగేశ్వరరావు ఈ ఫలితాలను ప్రకటించారు. ఆసెట్‌లో 19,219 మంది దరఖాస్తు చేసుకోగా 17,133 మంది పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ఆయీట్‌లో 3,191 మంది దరఖాస్తు కోగా 2,790 మంది పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ర్యాంక్‌ కార్డు మే 19 నుంచి ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య కె. నిరంజన్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ ఆచార్యులు నిమ్మ వెంకటరావులు తదితరులు పాల్గొన్నారు.