నాల్గవ మోటర్‌ వెట్‌ రన్‌ విజయవంతం

92

పెద్దపల్లి, మే 15 (న్యూస్‌టైమ్): కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీలో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం వద్ద భూగర్భంలో నిర్మించిన పంప్‌హౌస్‌లోని నాలుగో మోటార్‌ పంపు వెట్‌ రన్‌ విజయవంతమైంది. ఈ ట్రయల్‌ రన్‌ను సీఎం ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. మరోవైపు మధ్యాహ్నం చేపట్టిన మూడో పంపు వెట్‌ రన్‌ విజయవంతమైంది. గత నెల 24, 25వ తేదీల్లో అధికారులు మొదటి, రెండో మోటర్ల వెట్‌ రన్‌ నిర్వహించారు. బుధవారం మూడో, నాల్గవ మోటర్‌ వెట్‌ రన్‌లను చేపట్టారు.

బుధవారం ఒక్క రోజే రెండు పంపుల వెట్‌ రన్‌ విజయవంతంలో అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింకు-2లో భాగంగా నంది మేడారం వద్ద అండర్‌ టన్నెల్‌లో భారీ పంపు హౌస్‌ నిర్మించారు. ఇక్కడికి వచ్చిన నీటిని పక్కనే ఉపరితలంలో ఉన్న మేడారం రిజర్వాయర్‌లో ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌లో ఏడు భారీ మోటర్లు ఏర్పాటు చేశారు.

కాగా, ఈ వానకాలంలోనే రైతులకు కాళేశ్వరం జలాలను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం బుధవారం మరో కీలకఘట్టాన్ని విజయవంతంగా పూర్తిచేసిందనే చెప్పాలి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా నందిమేడారం అండర్ టన్నెల్‌లోని పంప్‌హౌస్ ద్వారా నందిమేడారం రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసే మూడు, నాలుగు మోటర్ల వెట్న్‌న్రు నిర్వహించింది. రెండుమోటర్లు నిర్ణీత సమయంలో నిర్దిష్ట ఆర్పీఎం (రెవల్యూషన్స్ పర్ మినిట్)కు చేరుకొని మేడారం సర్జ్‌పూల్ నుంచి నందిమేడారం రిజర్వాయర్‌లోకి విజయవంతంగా నీటిని ఎత్తిపోశాయి.

మూడు, నాలుగు మోటర్ల వెట్న్ సక్సెస్‌కావడంపై కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఇంజినీర్ల బృందం సంతోషానికి అవధుల్లేకుండాపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లింకు -2లో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఆరో ప్యాకేజీ కింద ఎల్లంపల్లి నుంచి నందిమేడారం రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసేందుకు భూగర్భంలో భారీ పంప్‌హౌస్ నిర్మించిన విషయం తెలిసిందే. ఎల్లంపల్లి నుంచి 1.1 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా వచ్చే నీరు ఆ తర్వాత 9.5 కిలోమీటర్ల మేర నిర్మించిన జంట సొరంగాల ద్వారా నందిమేడారం పంప్‌హౌస్‌లోకి చేరుతుంది. నీటిని మేడారం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌లో 124.4 మెగావాట్ల సా మర్థ్యం ఉన్న ఏడుమోటర్లను ఏర్పాటుచేస్తున్నారు.

ఇప్పటికే 4 మోటర్ల బిగింపు పూర్తవగా, మిగిలిన మూడింటి పను లు చివరిదశలో ఉన్నాయి. బిగింపు పూర్తయిన నాలుగు మోటర్లలో గత నెల 24, 25 తేదీల్లో మొదటి, రెండో మోటర్ల వెట్న్‌న్రు విజయవంతంగా నిర్వహించిన అధికారులు బుధవారం మూడు, నాలుగు మోటర్ల వెట్న్‌న్రు పూర్తిచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్సీ ఎన్ వెంకటేశ్వర్లు ఎత్తిపోతల పథకం సలహాదారు పెంటారెడ్డి, సీఎంవో ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ట్రాన్స్‌కో డైరెక్టర్ సూర్యప్రకాశ్‌తో కలిసి మధ్యాహ్నం 12:10 గంటలకు మూడో మోటర్ ద్వారా నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు. నిర్ణీత సమయానికి 200 ఆర్పీఎంకు చేరుకొని నందిమేడారం సర్జ్‌పూల్ నుంచి నందిమేడారం రిజర్వాయర్‌లోకి 3,200 క్యూసెక్యుల నీటిని ఎత్తిపోసింది.

ఈ పంపును 23 నిమిషాలపాటు నడిపించారు. సాయం త్రం 6.40 గంటలకు నాలుగో మోటర్‌ను వెట్న్ నిర్వహించారు. ఈ మోటర్‌కు మొదట డ్రైరన్, ఆ తర్వాత వెట్న్ నిర్వహించారు. 30 నిమిషాలపాటు పరీక్షించగా 3,200 క్యూసెక్కుల నీటిని నందిమేడారం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసింది.

కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఈడీ ప్రభాకర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ నూనె శ్రీధర్, నీటిపారుదలశాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ రామారావు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకమైన లింక్-2లో ఆరో ప్యాకేజీలోని మోటర్ల వెట్న్‌న్రు విజయవంతంగా పూర్తిచేసిన నీటి పారుదలశాఖ అధికారులు ఇక లింక్-1లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బరాజ్‌కు అనుబంధంగా ఉన్న కన్నెపల్లి పంపుహౌస్‌లో మోటర్ల ద్వారా నీటి ఎత్తిపోత పరీక్షకు ఏర్పాట్లుచేస్తున్నారు.

అదేవిధంగా ప్యాకేజీ -7 పనులు పూర్తిచేసి ప్యాకేజీ -8లోని భారీ మోటర్ల ఎత్తిపోతలకు సైతం సిద్ధమవుతున్నారు. మే, జూన్ నెలల్లో లింక్-1, లింక్-2లోని మోటర్లన్నింటినీ సిద్ధం చేసుకొని జూలైలో గోదావరినదిలోకి వచ్చే వరద నీటిని మిడ్‌మానేరుతోపాటు ఎస్సారెస్పీకి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వానకాలంలోనే చెరువులు, కుంటలు నింపడంతోపాటు ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2 ద్వారా 13లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు సర్కార్ సన్నద్ధమవుతున్నది. కాళేశ్వరం ప్రాజె క్టు ఆరో ప్యాకేజీలోని నందిమేడారంలో మూడు, నాలుగు మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయడం విజయవంతంపై వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.

మోటర్ల వెట్న్ విజయవంతానికి కృషిచేసిన ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. కాళేశ్వరంతో మరిం త ఆయకట్టు పెరుగుతుందని చెప్పారు. తెలంగాణను కోటి ఎకరాల మగాణంగా మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆశయం త్వరలోనే నెరవేరబోతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సంకల్ప బలంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం సాధ్యమైందని, నందిమేడారంలోని మూడు, నాలుగు మోటర్ల వెట్న్ విజయవంతమైందని, రైతులు సంతోషపడదగిన రోజు ఇదనీ, తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా మారేదిశలో నందిమేడారం పంపుల వెట్న్ ఒక మైలురాయిగా భావిస్తున్నామని, వచ్చే వానకాలంలో చెరువులు, నింపడంతో పాటు ఎస్సారెస్పీ స్టేజీ-1, స్టేజీ-2 మొత్తం కలిపి 13 లక్షల ఎకరాలకు సాగునీరందుతుందని, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటిని తరలించేలోపు ఎస్సారెస్పీ పునర్జీవ పనులు పూర్తిచేస్తామన్నామన్నారు. సీఎంవో ఎఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తెలిపారు.