జూన్ 4న కేరళ తీరానికి రుతుపవనాలు

136

న్యూఢిల్లీ, మే 14 (న్యూస్‌టైమ్): జూన్‌ 4న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు తెలుస్తోంది. వీటివల్ల 2019లో సరాసరి వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదవనుందని వాతావరణ సంస్థ స్కైమెట్ మంగళవారం వెల్లడించింది. దీనివల్ల అధిక వ్యవసాయ ఉత్పత్తి, వృద్ధి రేటు అవకాశాలు తగ్గన్నాయి. సాధారణంగా జూన్‌ ఒకటో తేదీ కల్లా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి.

జులై మధ్యలో దేశం మొత్తం విస్తరిస్తాయి. సకాలంలో కురిసే వర్షాలు వరి, సోయాబీన్‌, పత్తి వంటి పంటలకు అనుకూలం. దేశ దీర్ఘకాల సగటులో 93 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్కైమెట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత దేశ వార్షిక వర్షపాతంలో 70 శాతం ఈ సీజన్‌లోనే అందుతుంది. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌ వ్యవసాయ రంగానికి ఇది ఆయువు పట్టు వంటిది.