ఏపీ పీజీ ఈసెట్‌ ఫలితాలు విడుదల

107

అమరావతి, మే 14 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌లో పీజీ ఈసెట్‌-2019 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు విడుదల చేశారు. ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 24,248 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫలితాల్లో 20,986 మంది విద్యార్థులు అర్హత సాధించారు.

ఈ నెల 20 నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకొనే అవకాశం కల్పించారు. 12 ఇంజినీరింగ్‌ పీజీ కోర్సులు, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలోనే కౌన్సెలింగ్‌ జరగనుంది.