యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం

61
  • మిస్టర్‌ రిక్రూటర్స్‌ హెచ్‌ఆర్‌ సొల్యూషన్స్‌

  • సినీ నటుల చేతుల మీదుగా వెబ్‌సైట్‌ ప్రారంభం

విశాఖపట్నం, మే 11 (న్యూస్‌టైమ్): మిస్టర్‌ రిక్రూటర్స్‌-హెచ్‌ఆర్‌ సొల్యూషన్స్‌ సంస్థ శనివారం నగరంలో ప్రారంభమైంది. సిరిపురం కూడలిలోని మంత్రీస్ హోటల్‌లో మిస్టర్‌ రిక్రూటర్స్‌ సంస్థ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సంస్థ ఎండి, సిఈఓ బి.వంశీక్రిష్ణ తెలియజేశారు. ముందుగా సంస్థ పోస్టర్‌, వెబ్‌సైట్‌లను సినీ నటులు చిట్టిబాబు, గీతా సింగ్‌, జయలలిత, శ్రీలక్ష్మి, రాగిణి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ వంశీక్రిష్ణ మాట్లాడుతూ వాణిజ్య, వ్యాపార సంస్థల విస్తరణ నేపధ్యంలో ఉపాధి అవకాశాలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయన్నారు.

వీటిని దృష్టిలో ఉంచుకుని నిపుణత, అర్హత కలిగిన యువతకు అవసరమైన పూర్తిస్థాయిలో ఉపాధి అవకాశాలకు కల్పించే విధంగా ఈ సంస్థ పనిచేస్తుందన్నారు. సంస్థలకు, నిరుద్యోగ యువతకు మధ్య వారధిగా తమ సంస్థ పనిచేస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు పూర్తిస్థాయిలో ఉచితంగా ఉపాధిని కల్పించే దిశగా తమ సంస్థ పనిచేస్తుందన్నారు. సంస్థ ప్రారంభ సందర్భంగా ఆరునెలల కాలం ఉచితంగా నిరుద్యోగ యువతకు పూర్తిస్థాయిలో సేవలు అందించడం జరుగుతోందన్నారు. సినీ హాస్య నటుడు చిట్టిబాబు మాట్లాడుతూ ప్రతీ నిరుద్యోగికి తగిన ఉపాధిని కల్పించే విధంగా సంస్థ పనిచేయాలన్నారు. ఇటువంటి సమాజహిత కార్యక్రమాలలో భాగం కావడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

యువతలోని సామర్ధ్యాలను గుర్తించి తదనుగుణంగా ఉపాధిని కల్పించాలని సూచించారు. సంస్థ చైర్మన్‌ బి.వెంకటరమణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ వాణిజ్య సంస్థలలో ఎప్పటికప్పుడు ఖాళీలకు గుర్తించి, వారి అవసరకాలకు అనుగుణంగా యువతకు ఎంపిక చేసి ఉపాధిని కల్పించడం జరుగుతుందన్నారు. పూర్తిస్థాయిలో సంస్థ తమ సేవలు అందించే ప్రక్రియ ప్రారంభమయ్యిందన్నారు. నిత్యం అనేక సంస్థల్లో నిపుణులైన సిబ్బంది కొరత దర్శనమిస్తోందన్నారు. వీటిని నివారించే దిశగా ఈ సంస్థ పనిచేస్తుందన్నారు. నిరుద్యోగ యువత తమ సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సినీనటులు శ్రీలక్ష్మి, గీతాసింగ్‌ మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించే దిశగా మిస్టర్‌ రిక్రూటర్స్‌ పనిచేయాలన్నారు. ప్రతీ ఒక్కరికి ఉపాది కల్పించాలనే ఉద్దేశం ఎంతో మంచిదన్నారు. ఇటువంటి అవకాశాలకు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ షేక్‌ నవాజ్‌, మేనేజర్‌ సల్మా తదితరులు పాల్గొన్నారు.