వేసవి సెలవుల్లో సుప్రీంకోర్టుకు ప్రత్యేక ధర్మాసనాలు

122

న్యూఢిల్లీ, మే 11 (న్యూస్‌టైమ్): దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు శనివారం నుంచి వచ్చే నెల 30 వరకు వేసవి సెలవులు. ఈ నేపథ్యంలో అత్యవసర వాజ్యాల విచారణకు మాత్రం ప్రత్యేక ధర్మాసనాలను ఏర్పాటుచేస్తూ ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. దీంతో జడ్జిలు వేసవి విడిది కోసం శీతలప్రాంతాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇక, ధర్మాసనాల వారీగా ప్రత్యేక న్యాయమూర్తులను నియమిస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది. మే 13 నుంచి మే 20 వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం, మే 21 నుంచి మే 24 వరకు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం, మే 25 నుంచి మే 30 వరకు సీజేఐ గొగోయ్, జస్టిస్ ఎం.ఆర్ షా ధర్మాసనం, మే 31 నుంచి జూన్ 2 వరకు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎం.ఆర్ షా ధర్మాసనం, జూన్ 3 నుంచి జూన్ 5 వరకు జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం, జూన్ 6 నుంచి జూన్ 31 వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ రస్తోగి ధర్మాసనం మాత్రమే సేవలు అందించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ధర్మాసనాల పరిధిలో వాజ్యాల విచారణ జరిపేందుకు సీజేఐ చర్యలు చేపట్టారు.