‘నేషనల్ ఫ్రంట్’ను నడిపించిన ఎన్టీఆర్

80
Nandamuri Taraka Rama Rao former Chief Minister of Andhra Pradesh and founder of Telugudesam Party TDP with V P Singh Murusoli Maran National front Leaders

అమరావతి, మే 11 (న్యూస్‌టైమ్): 1987 కాలంలో కాంగ్రెస్ ను వీడి బయటకు వచ్చిన వీపీ సింగ్ ‘జనమోర్చా’ పేరుతో పార్టీని స్థాపించి దేశంలోని కాంగ్రెసేతర పార్టీలన్నిటినీ ఒకే వేదిక మీదకు తెచ్చి నిర్వహించిన సభ ఇది. నాయకులందరూ ఒకే వేదికపై నుండి తమ సంఘీభావాన్ని తెలుపుతూ సభకు విచ్చేసిన ప్రజలకు చేతులు ఊపుతూ అభివాదం చేస్తున్నప్పటి చిత్రం ఇది.

ఇందులో ఎన్టీఆర్ కూడా ఉన్నారు. ఆ తర్వాత 1988 అక్టోబర్ 11న జనమోర్చా పార్టీని చంద్రశేఖర్ నాయకత్వం వహిస్తున్న జనతాపార్టీ చీలిక వర్గంతోనూ, లోక్ దళ్ ఇంకా కాంగ్రెస్ (ఎస్) పార్టీలతో ఏకం చేసి ‘జనతాదళ్’ పార్టీగా ఏర్పరిచారు. 1989 ఎన్నికల నాటికి తమిళనాడులోని డిఎంకె, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం, అస్సాంలోని అస్సాం గణ పరిషద్ వంటి పార్టీలను కూడా కలుపుకుని జనతాదళ్‌ను ‘నేషనల్ ఫ్రంట్’గా మార్చారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో పార్టీలన్నిటినీ ఒకే వేదిక మీదికి తెచ్చేందుకు అప్పట్లో నందమూరి తారక రామారావు తీవ్రమైన కృషి చేశారు.

అందుకే ఎన్టీఆర్‌ను నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. వీపీ సింగ్ కన్వీనర్‌గా ఉన్నారు. తర్వాత ఎన్టీఆర్‌కు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ తన సేవలు రాష్ట్రానికే పరిమితమంతూ సున్నితంగా తిరస్కరించి ప్రధాని పీఠంపై వీపీ సింగ్‌ను కూర్చోబెట్టిన ఘనత ఎన్టీఆర్‌ది.