గర్భిణీలను పీడించే నిద్రలేమి సమస్య!

324

హైదరాబాద్, మే 11 (న్యూస్‌టైమ్‌): మహిళ గర్భిణీగా ఉన్నప్పుడు హార్మోన్ల మార్పు శారీరక అసమానతలు వల్ల నిద్ర లేమి సమస్య పట్టిపీడిస్తుంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు ప్రతీ త్రైమాసికానికీ నిద్ర లేమి సవాళ్ళను వచ్చిపడుతుంటాయి. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ పరిశోధనల ప్రకారం ప్రతీ త్రైమాసికానికి కొన్ని నిద్రలేమి మార్పులు గర్భిణీల్లో వస్తాయట. అంతేకాక 78 శాతం గర్భిణీ స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతున్నారని వెల్లడించింది. గర్భిణీ స్త్రీలలో నిద్రలేమి అనేది సహజమైన సమస్య.

గర్భము దాల్చాక ఎంతో కొంత నీరసం అతినిద్ర ఉండడం సహజమే కాని ఎక్కువ అలనట. అయితే, గర్భిణీగా ఉన్నప్పుడు మరీ నిద్రపోవడం మంచిది కాదని కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం నిద్ర లేవటం అనేది తరచూ ఎదురయ్యే సవాలు. ఉల్లాసంగా విశ్రాంతిగా మరునాడు మేల్కోవాలంటే మీరు ఒక దినచర్య అలవాటు చేసుకోవాలి. మొదటి త్రైమాసికంలో నిద్ర లేమి సమస్య మొదలవుతుంది. ఈ సమయంలో తరచుగా నడుస్తుండటం వల్ల ఎక్కువగా బాత్ రూంకి వెళ్ళాల్సివస్తుంది.

ప్రెగ్నెన్సీలో నిద్రించే సమయంలో అంతరాయాలు ఏర్పడటం వల్ల శారీరకంగా, మానసికంగా స్ట్రెస్ ఏర్పడటం జరుగుతుంది. పగటి పూట ఎక్కువగా నిద్రించటం జరుగుతుందని పరిశోధనలు రుజువుచేశాయి. ఇక, రెండవ త్రైమాసికంలో నిద్ర లేమి సమస్య మరింత తీవ్రమవుతుందట. రెండవ త్రైమాసికంలో నిద్ర లేమి సమస్య దాదాపూ చాలా మంది గర్భిణీ స్త్రీలలో ఒకటేలా ఉంటుంది. రాత్రి సమయాల్లో మూత్రం ఎక్కువ రాకపోవటం దీనికి కారణం. పిండం రోజు రోజుకీ వృధ్ధి చెందటం.

పిండం పెరగటం వల్ల ఇది బ్లాడెర్‌పై ఎక్కువ ఒత్తిడి ని కలిగించనివ్వకపోవటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ పరిస్తితిలో మానసిక ఒత్తిడి ఎక్కువై నిద్రలేమి సమస్యను పెంచుతుంది. చివరిగా మూడవ త్రైమాసికంలో గర్భిణీ స్త్రీలు చాలా నిద్రలేమి సమస్యల్ని ఎదుర్కొంటారు. క్రమక్రమంగా బొడ్డు పెరుగుదల వల్ల అసౌకర్యంగా ఉండటం. గుండెల్లో మంట, కాళ్ళ తిమ్మిర్లు, సైనుస్ రద్దీ.

రాత్రిళ్ళు మూత్రం ఎక్కువగా రావటం ఎందుకంటే బిడ్డ కదలికల వల్ల ఆ ఒత్తిడి బ్లాడెర్‌పై పడి తరచుగా మూత్రం వస్తుంది. అయితే, ఈ క్రమంలో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మీ ప్రెగ్నెన్సీలో చక్కని నిద్ర మీ సొంతం అవుతుంది. కానీ మరీ నిద్రలేమి సమస్య ఎక్కువ ఉంటే డాక్టరుని సంప్రదించటం మంచిది. ప్రెగ్నెన్సి సమయంలో వాడే పిల్లోస్ అంటే తలగడ దిండ్లు అదనంగా వాడటం మంచిది.

పడుకునేటప్పుడు మీ కడుపుకీ, వెనుక భాగంలో అంటే పిరుదుల దగ్గర పిల్లోస్ వేస్కోవాలి. దీని వల్ల మీ కడుపుకీ ఎంతో సపోర్ట్ దొరుకుతుంది. అంతేకాక మీ రెండు కాళ్ళ మధ్య ఒక పిల్లో వేసుకోవాలి. దీనివల్ల మీ కింది భాగంలో సపోర్ట్ దొరుకుతుంది. కొన్ని పిల్లోలు ఆకారంలో ఇరుకుగా ఉండేవి, అలాగే పూర్తిగా బోడీ కి సరిపడే పిల్లోలని వాడటం మంచిది. ఒక గ్లాస్ పాలు తాగటం వల్ల మీకు మంచి నిద్ర వస్తుంది. కార్బోహైడ్రేడ్లు ఉన్న పదార్ధాలను తీసుకోవటం మంచిది. బ్రెడ్, క్రాకర్లు మీ నిద్రను పెంచుతాయి.

అంతేకాక కొన్ని ఎక్కువ ప్రోటీన్లు ఉన్న స్నాక్స్ తీసుకోవటం వల్ల మీ బ్లడ్ షుగర్‌ను పెంచటమే కాక మీకు చెడు కలలు రాకుండా, తలనొప్పులు రాకుండా చేస్తాయి. కొంతమంది గర్భిణీ స్త్రీలు ఆస్త్మ లేదా హైపెర్థైరాయిడిజం సమస్యతో సతమతమవుతుంటారు. గర్భిణీ స్తీలకు సహజంగా ముక్కులోని రంధ్రాలు ఉబ్బటం వల్ల ఎక్కువగా బిగ్గరగా గురక తీస్తుంటారు. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ లెక్కల ప్రకారం 30 శాతం ఈ సమస్యకు గురి అవుతున్నారు. విశ్రాంతి తీసుకోవటం వల్ల మీ మనస్సుకి, కండరాలకూ విశ్రాంతి పొందుతాయి. ఈ మార్గాల్లేమిటంటే యోగ, మస్సాజ్, స్ట్రెచింగ్ లాంటివి. ఎక్కువగా శ్వాస తీసుకోవటం, వేడి నీళ్ళతో స్నానం, పడుకునే ముందు ఖచ్చితంగా స్నానం చేయాలి.