నోరూరించే గోంగూర మటన్‌ తిందామా?

423

మనం రోజువారీ తీసుకునే ఆహారమే కాకుండా సాధారణంగా వీకెండ్‌ లేదా ఇతర సెలవులు, తీరిక సమయాలలో నోరూరించే అనేక వంటకాలు చేసుకోవచ్చు. అలా తయారుచేసుకునే వాటిలో గోంగూర మటన్‌ ఐటమ్‌ ఒకటి. కావాల్సిన పదార్థాలు… మటన్‌-కప్పు, గోంగూర-కప్పు, గసాలు-50 గ్రా, జీడిపప్పు-10 గ్రా, నూనె-సరిపడా, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, కారం- టేబుల్‌ స్పూన్‌, పచ్చిమిర్చి-నాలుగు, ధనియాల పొడి-టీ స్పూన్‌, గరం మసాల పొడి-చిటికెడు.

తయారీ విధానం… గసాలు, జీడిపప్పును కలిపి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. పాత్రలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలను వేయించిన తర్వాత అందులో పచ్చి మిర్చి, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి ఒకదాని తర్వాత ఒకటిగా వేయాలి. అన్నీ వేగాక తర్వాత మటన్‌ వేసి తగినంత నీటిని ఉడికించాలి. మటన్‌ ఉడికిన తర్వాత గోంగూర, గసాలు జీడిపప్పు, మసాలా వేసి ఉడికిస్తే గోంగూర మటన్‌ రెడీ!