అరుణాచ‌ల్‌‌ ఎస్టీ జాబితాలో స్వల్ప స‌వ‌ర‌ణ‌లు

88

న్యూఢిల్లీ, మే 11 (న్యూస్‌టైమ్): అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకూ అమలులో ఉన్న షెడ్యూల్డు తెగ‌ల (ఎస్‌టి) జాబితాలో మార్పులు చేసేందుకుగాను రాజ్యాంగంలోని (షెడ్యూలు తెగ‌ల‌) ఆదేశం, 1950లో కొన్ని స‌వ‌ర‌ణ‌లను తీసుకురావడానికి వీలుగా రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ బిల్లును కేంద్రం ప్రతిపాదించింది. ఈ బిల్లును పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టేందుకు వీలుగా కేంద్ర మంత్రిమండలి కూడా ముందుగా ఆమోదం తెలిపింది. తాజా సవరణ ప్రకారం క్రమ సంఖ్య 1లో ‘అబొర్’ ప‌దాన్ని తొల‌గించనున్నారు. దీనికి కారణం ఇదే విధంగా క్రమ సంఖ్య 16లోని ‘ఆది’కి మల్లేనే ఉంది కాబట్టి. అదే విధంగా క్రమ సంఖ్య 6లో ‘ఖాంప్తి’ స్థానంలో ‘తాయీ ఖామ్తీ’ ప‌దాన్ని చేర్చడం జరుగుతుంది. క్రమ సంఖ్య 8లో మిశ్మి- కామన్ (మిజు మిశ్మీ), ఇదు ( మిశ్మీ), ఇంకా త‌రావో (డిగారూ మిశ్మీ)లను చేర్చనున్నారు.
క్రమ సంఖ్య 9లో ‘మొమ్బా’ స్థానంలో మొన్పా, మెమ్బా, స‌ర్ తాంగ్‌, స‌జోలోంగ్‌ (మిజీ)లను చేర్చడంతో పాటు అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ షెడ్యూల్డు తెగ‌ల జాబితాలో క్రమ సంఖ్య 10లోని ‘ఏదైనా నాగా తెగ’ అన్న పదాల స్థానంలో ‘నాక్టే’, ‘తాంగ్ సా’, ‘తుత్సా’, ‘వాంచో’ ప‌దాలను చేర్చనున్నారు. ‘అబొర్’ను తొల‌గించడం- నకలుకు స్వస్తి పలకినట్లవుతుంది. ఖాంప్తిని తొలగించడం ద్వారా వేరే ప‌దం చేర్చడం, ఖాంప్తి పేరుతో షెడ్యూల్డు తెగ‌ ఏదీ లేదన్న విషయాన్ని స్పష్టంచేయనుంది. మిశ్మి- కామన్‌, ఇదు, ఇంకా త‌రావోలను చేర్చడం- వీటిలో కేవలం ‘మిశ్మి’ని చేర్చడం జరిగింది. ఈ విధమైనటువంటి సముదాయం ఏదీ లేన‌ట్టు స‌మాచారం.
మోన్పా, మెమ్బా, స‌ర్ తంగ్‌, వాంచోలను చేర్చడం- వీటిలో ‘ఏదైనా నాగా తెగ’ను చేర్చడం జరిగింది. రాష్ట్రంలో కేవలం ఇవే నాగా తెగ‌లుగా ఉన్నట్టు సమాచారం. ‘నోక్టే’, ‘తాంగ్ సా’, ‘తుత్సా’, ‘వాంచో’లను చేర్చడం- రాష్ట్రంలో కేవలం ఈ నాగా తెగ‌లు అని సమాచారం ఉంది. మొత్తానికి ఈ బిల్లు చ‌ట్ట రూపం దాలిస్తే అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌‌లోని షెడ్యూల్డు తెగ‌ల స‌వ‌రించిన జాబితాలో నూత‌నంగా చేరిన సముదాయాలకు చెందిన వారు ప్ర‌స్తుత ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌గ‌లుగుతారు.
ఈ తరహా ప్రముఖ ప్రయోజనాలలో కొన్ని ఏవంటే? పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్‌, నేషన‌ల్ ఓవ‌ర్‌సీస్ స్కాల‌ర్‌షిప్‌, నేషన‌ల్ ఫెలోషిప్‌, అత్యున్న‌త స్థాయి విద్య‌, నేషన‌ల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్, డివెల‌ప్‌మెంట్ కార్పొరేషన్ నుండి రాయితీతో కూడిన రుణాలు, ఇంకా ఎస్‌సి, ఎస్‌టి బాల బాలిక‌ల‌కు వసతిగృహ‌ స‌దుపాయం వంటివి అందుబాటులోకి రానున్నాయి. వీటికి అదనంగా, వీరు ప్ర‌భుత్వ విధానానికి అనుగుణంగా ప్ర‌భుత్వ ఉద్యోగాల‌లోను, విద్యా సంస్థ‌ల‌ ప్రవేశాలలోను రిజ‌ర్వేషన్ల ప్రయోజనాలను కూడా పొంద‌డానికి హక్కుదారులు అవుతారు.