పాపకు జన్మనిచ్చి ప్రాణాలు కోల్పోయిన తల్లి!

182

సిరిసిల్ల, మార్చి 25 (న్యూస్‌టైమ్): ప్రసూతి కొరకు ఆసుపత్రికి వచ్చిన బాలింత పాపకు జన్మనిచ్చి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లి మార్గం మధ్యలోనే తుది శ్వాస విడిచిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అమ్మాపూర్ గ్రామానికి చెందిన గుగులోతు నీలా ప్రసూతి సేవల కోసం సిరిసిల్ల ఆసుపత్రికి వచ్చిన తర్వాత వైద్యులు ఆమెకు ప్రసూతి ఆపరేషన్ చేశారు. నీలా ఆడ పాపకు జన్మనిచ్చిన అనంతరం ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రి సిబ్బందిని భర్త తిరుపతి ప్రశ్నించగా కరీంనగర్ తీసుకెళ్లాలని అంబులెన్స్ మాట్లాడుకోవాలని చెప్పడంతో, చేసేదేమీ లేక అంబులెన్స్‌లో తన భార్య నీలాను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ కూడా కరీంనగర్ ఆసుపత్రి సిబ్బంది వరంగల్ తీసుకెళ్లాలని చెప్పడంతో, కరీంనగర్ నుండి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లిన అనంతరం బాలింతరాలైన నీలా మరణించిందని చెప్పడంతో భర్త తిరుపతి శోకసంద్రంలో మునిగిపోయాడు.

మృతురాలి బంధువులు ఆవేశంతో డాక్టర్ల నిర్లక్ష్యం అంటూ ధర్నాకు దిగడంతో జరిగిన సంఘటనను జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌‌ వారికి వివరించడంతో చేసేదేమీ లేక మృతదేహాన్ని తీసుకునివెళ్ళిపోయారు.