గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై సమావేశం

147

విశాఖపట్నం, మార్చి 25 (న్యూస్‌టైమ్): కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయడానికి సంబంధించిన అడ్వయిజరీ, అకడమిక్‌కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఏయూ పాలక మండలి సమావేశ మందిరంలో జరిగిన ఈ రెండు సమావేశాలకు ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సమావేశ వివరాలను ఆయన వివరించారు.

దీనిలో భాగంగా రానున్న విద్యా సంవత్సరం నుంచి గిరిజన విశ్వవిద్యాలయం కోర్సులకు ప్రవేశాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. దీనిలో భాగంగా కోర్సుల ఎంపిక, సిలబస్‌ తయారీలపై విస్తృతంగా చర్చించడం జరిగిందన్నారు. సిలబస్‌ల రూపకల్పను అవసరమైన బీఓఎస్‌లను ఏర్పాటు చేసామన్నారు. సమావేశంలో ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం (అమర్‌ కంఠక్‌) ఉపకులపతి ఆచార్య టి.వి కత్తిమణి, సిక్కిం కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య మహేంద్ర లామా, ఐఐఎంవీ సంచాలకులు ఆచార్య చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొని తమ విలువైన సూచనలు అందించారన్నారు. నూతనంగా విజయనగరంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన విధి, విధానాలను తయారు చేయడం జరిగిందన్నారు.

కార్యక్రమంలో ఏయూ రెక్టార్‌ ఆచార్య ఎం.ప్రసాదరావు, రిజిస్ట్రార్‌ ఆచార్య కె.నిరంజన్‌, ఆచార్య కె.శ్రీనివాసరావు, ఆచార్య పి.బాబి వర్థన్‌, ఆచార్య కె.ప్రసన్న శ్రీ, ఆచార్య పి.విజయప్రకాష్‌, ఆచార్య వై.వెంకటరావు, ఆచార్య డి.అప్పలనాయుడు, ఆచార్య పి.వాణి, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్‌ లక్షీ షా, ఆచార్య కె.వెంకటరావు, ఆచార్య ఎం.వి బసవేశ్వరరావు, ఆచార్య గోపినాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్‌ ఎన్‌.వి.ఎస్‌ సూర్యనారాయణ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.