వాణిజ్యవ్యాప్తికి ఏపీ అనుకూలం: ఏయూ వీసీ

145

విశాఖపట్నం, మార్చి 25 (న్యూస్‌టైమ్): వాణిజ్య వ్యాప్తికి ఆంధ్రప్రదేశ్‌ ఎంతో అనుకూలంగా ఉంటుందని వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు అన్నారు. సోమవారం ఉదయం ఏయూ కామర్స్‌మేనేజ్‌మెంట్‌ విభాగంలో యూజీసీ శాప్‌లో భాగంగా నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు’ విశాఖ-చెన్నయ్‌ వాణిజ్య కారిడార్‌, ఏపీలో వాణిజ్య ప్రగతి’ని ఆయన ప్రారంభించారారు. అనంతరం మాట్లాడుతూ సముద్రమార్గంలో వస్తు రవాణాలకు ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా నిలుస్తుందన్నారు. సముద్ర ఉత్పత్తులు, ఫార్మ, రసాయన పరిశ్రమలు ఈ ప్రాంతంలో గణనీయంగా అభివృద్ధి సాగిస్తున్నాయన్నారు.

సదస్సులో నిపుణుల సూచనలు ప్రభుత్వాలకు నూతన విధానాల రూపకల్పనలో ఉపకరిస్తాయన్నారు. ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.రామమోహన రావు మాట్లాడుతూ మధ్య, చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ఎంతో అవసరమన్నారు. నేడు నిరుద్యోగం ప్రతీ సమాజంలో దర్శనిమస్తోందన్నారు. ఎంఎస్‌ఎంఇలను ప్రోత్సహించడం ద్వారా నిరుద్యోగానికి పరిష్కారం చూపడం సాధ్యపడుతుందన్నారు. తద్వారా ప్రాంతీయ అభివృద్ధి సాకారం అవుతుందన్నారు.

సంపద విభజన జరిగి అసనామతలు తొలగిపోతాయన్నారు. భారత దేశంలో మంచి మార్కెట్‌ ఉందని, ఉత్పత్తులకు కొనుగోలుకు ఢోగా ఉండదన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి ఆచార్య జి.సత్యనారాయణ, సదస్సు సంచాలకులు ఆచార్య కె.సాంబశివ రావు, ఎస్‌టిపిఐ జెడి ఎం.డి దూబే తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో విభాగ ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.