ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

76

కాకినాడ, మార్చి 18 (న్యూస్‌టైమ్): తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల పోలింగుకు సెక్టార్ అధికార్లు, ప్రిసైడింగు, అసిస్టెంట్ ప్రిసైడింగు అధికారులను సకాలంలో పోలింగు స్టేషన్లకు చేర్చాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు కార్తికేయమిశ్రా ఆదేశించారు. సోమవారం నాడు కాకినాడ కలెక్టరేట్ నుండి రిటర్నింగు అధికారులతో ఎమ్మెల్సీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగు ప్రక్రియపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ పోలింగు కేంద్రాలకు పిఓ, ఎపిఒ, సిబ్బందిని ఉదయం 7-00గంటలకు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.

పోలింగు ప్రారంభసమయంను తదుపరి గంట గంటకు వివరాలు తెలపాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ నుండి పోలింగ్ కేంద్రాలకు చేర్చాలన్నారు. పోలింగు పార్టీలను తిరిగి తీసుకువచ్చేటప్పుడు స్టాట్యూటరీ ఫారాలు పూర్తిచేసిన వివరాలు చేరిక్ చేయాలన్నారు. పోలింగు రోజున ఆయా కేంద్రాలను రెండు సార్లు సెక్టోరల్ అధికారులు విజిట్ చేయాలన్నారు. యాప్ ద్వారా గంట గంటకు పోలింగు వివరాలు తెలియజేయాలన్నారు.

పిఓలు, ఎపిఓలు ఫారం 17సి ఖచ్చితంగా నింపాలని కలక్టరు సూచించారు. అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాల ఎక్స్‌పెండీచర్ అబ్జర్వర్లు వచ్చారని, వారిని కలిసి అవసరమైన ఏర్పాటు చేపట్టాలని కలక్టరు కార్తికేయమిశ్రా రిటర్నింగు అధికారలకు సూచించారు. ఏరోజు కారోజు వచ్చిన నామినేషన్ల వివరాలు డేటాలో అప్‌లోడ్ చేయాలన్నారు. ఫారమ్-6 పెండెన్సీ ఈ నెల 23వ తేదీ పరిష్కరించి ఇఆర్ఓ నెట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆర్ఓలకు సూచించారు.

ఎఫిక్ కార్డ్సు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని కలెక్టరు తెలిపారు. దివ్యాంగులకు వీల్ ఛైర్స్ గుర్తించాలని వాలంటరీలను 17 సం.లోపు ఉన్నవారిని ఎంపిక చేసి నియమించాలన్నారు. పోలింగు స్టేషన్ల లిస్టు తయారు చేసి ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతిరాగానే తెలుగు, ఇంగ్లీషులో ముద్రించాలన్నారు. స్ట్రాంగురూమ్ ఫోటోగ్రాప్ అప్‌లోడ్ చేయాలని రిటర్నింగు అధికారులకు కలెక్టరు సూచించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం, కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్‌లు సుమిత్ కుమార్ గాంధీ, కె.రమేష్, డిఆర్ఓ ఎమ్.వి.గోవిందరాజులు, తదితరులు పాల్గొన్నారు.