బందరులో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

92

మచిలీపట్నం, మార్చి 18 (న్యూస్‌టైమ్): మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అయిన కృష్ణా జిల్లా కలెక్టరు ఎఎండి ఇంతియాజ్ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ను సోమవారం జారీ చేశారు. సోమవారం నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, ఈ నెల 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని ఈ నెల 23, 24 తేదీలు ప్రభుత్వ సెలవులు అయినందున నామినేషన్ల స్వీకరణ ఉండదని, ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారని ఎన్నికల నోటీసులో పేర్కొన్నారు.