వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్

106

హైదరాబాద్, మార్చి 7 (న్యూస్‌టైమ్): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవం శనివారం నిర్వహిస్తున్నారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) మాజీ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ అయ్యప్పన్ ముఖ్యఅతిథిగా హాజరై స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నారు.

విశ్వవిద్యాలయం చాన్స్‌లర్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అధ్యక్షతన జరిగే ఈ స్నాతకోత్సవంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన తొమ్మిది మంది పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు, 17 మంది గ్రాడ్యుయేట్లకు బంగారు పతకాలు, పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేసిన 119 మందికి, వ్యవసాయ ఇంజినీరింగ్, గృహ విజ్ఞాన డిగ్రీ చదివిన 380 మందికి పట్టాలు అందజేయనున్నారు.

గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రవీణ్‌రావు మర్యాదపూర్వకంగా కలిసి స్నాతకోత్సవ ఆహ్వానపత్రిక అందజేశారు. ఆలిండియా బెస్ట్ వీసీ అవార్డు పొందిన ప్రవీణ్‌రావును గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు.